ఆదిలాబాద్ పట్టణంలోని టీడీసీ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా ఎన్నికల సిబ్బంది పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు.
కాసేపట్లో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం మూడు హాళ్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాన్ని ఆదిలాబాద్ జేసీ సంధ్యారాణి, అసిస్టెంట్ కలెక్టర్ అభిలాష అభివన్ పర్యవేక్షించారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఇదీ చూడండి : బస్తీకా బాద్షా: పురపోరులో ఇప్పటికే 80 ఏకగ్రీవాలు...