తెరాస ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే భాజపా ఎంపీ సోయం బాపూరావు విమర్శలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్లో ఆయన మాట్లాడారు. భారతీయ పౌరుడిగా తప్పు చేసిన వ్యక్తి ప్రధాని అయినా విమర్శించే హక్కు తనకు ఉందన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుతో ఎవరికి నష్టం జరగదని చెబుతున్నప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: వంద శాతం అక్షరాస్యతే ధ్యేయం: కేసీఆర్