ఆదిలాబాద్ జిల్లాలో లాక్‌డౌన్ అమలను జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు పాలనాధికారి నటరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలో జనసంచారం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. అనవసరంగా బయటకు వచ్చే వాహనాలను సీజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ఒకవేళ అత్యవసరమైతే తెలంగాణ పోలీసు లాగిన్‌లో పేరు నమోదు చేసుకొని అనుమతి తీసుకోవాలని ఎస్పీ సూచించారు. మాస్కు లేకుండా బయటకు రావొద్దని అదనపు పాలనాధికారి ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో