ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. కొవిడ్ 19 కంట్రోల్ రూమ్‌ను జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ప్రారంభించారు. కొవిడ్ అత్యవసర పరిస్థితుల్లో ప్లాస్మా, ఆక్సిజన్, ఆసుపత్రి బెడ్స్, వెంటిలేటర్, మెడిసన్ వీటిలో ఏ అవసరం ఉన్నా... సంప్రదించాలని కోరారు. పది మందితో కూడిన ఒక టీమ్ తయారుగా ఉంటుందని పేర్కొన్నారు. ఆసుపత్రి బెడ్లు, చికిత్స పొందుతున్న వారి వివరాలను అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అవసరమున్న వారికి ఆక్సిజన్ సిలిండర్ పంపిణీ చేశారు.
ఇదీ చూడండి : వ్యాక్సిన్ వేసుకోవాలని సీఎం ఎందుకు చెప్పటం లేదు: బండి సంజయ్