ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును రాష్ట్ర ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్‌లో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శనతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలను దూరం చేసేలా ప్రభుత్వ వ్యవహరిస్తోందని.. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది.
ఇదీ చదవండి: రాష్ట్రాల హక్కులు హరించడంలో కాంగ్రెస్, భాజపాల పాత్ర : కేసీఆర్