ఇటీవల వచ్చిన వరదల కారణంగా... హైదరాబాద్‌కు చెందిన 'ప్యూర్' స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల బృందం... ఆ ప్రాంతాన్ని సందర్శించింది. అక్కడి ప్రజల బతుకును గమనించి.. వారి పరిస్థితికి చలించిపోయింది. సుమారు లక్షన్నరకు పైగా ఖర్చుచేసి బడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది తిరిగి ప్రారంభించింది. ఇంటర్ చదివిన ఓ యువకుడిని విద్యావాలంటరీగా నియమించి చిన్నారుల చేతులతో అక్షరాలు దిద్దిస్తోంది.
వ్యవసాయమే జీవనాధారంగా సాగే గుండంలొద్ది వాసులు ప్రభుత్వ పథకాలకూ నోచుకోవట్లేదు. స్వచ్ఛంద సంస్థ ప్రేరణతోనే దశాబ్దం తర్వాత బడి ప్రారంబించినప్పటికీ... మధ్యాహ్న భోజనం పెట్టేందుకూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
చూసిపోదామని వచ్చిన యువకుల హృదయాన్ని కరిగించిన ఆ బడుగు బతుకుల జీవన చిత్రం... గిరిజన అభ్యున్నతి కోసం పనిచేస్తామని మైకులు పగిలేలా అరిచే.... లీడర్ల దృష్టిని ఆకర్శించకపోవడం ఆశ్యర్యమే...!