ETV Bharat / state

ఓ ప్రైవేటు అధ్యాపకుడి ఆలోచన... బైక్​ శానిటైజర్​కు రూపకల్పన - తెలంగాణ తాజా వార్తలు

కరోనా నివారణకు స్వీయ నియంత్రణ అవసరం... ఇందులో భాగంగా మాస్కులు, శానిటైజర్ల వినియోగం పెరుగుతోంది. పారిశుద్ధ్య సిబ్బంది రసాయనాలు పిచికారీ చేస్తున్నప్పటికీ....ఇరుకు ప్రాంతాల్లో శానిటైజ్‌ చేయటం ఇబ్బందిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో...ఆదిలాబాద్‌కు చెందిన సుభాష్‌.. పరిసరాలను శుభ్రపరుచుకోవటానికి సంకల్పించాడు. సాంకేతికత ఉపయోగించి తక్కువ ఖర్చుతో శానిటైజర్‌ బైక్‌ తయారు చేశాడు.

Shanitaizer_Bike
ఓ ప్రేవేటు అధ్యాపకుడి ఆలోచన... బైక్​ శానిటైజర్​కు రూపకల్పన
author img

By

Published : Jul 14, 2020, 11:07 AM IST

Updated : Jul 14, 2020, 2:10 PM IST

ఓ ప్రైవేటు అధ్యాపకుడి ఆలోచన... బైక్​ శానిటైజర్​కు రూపకల్పన

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో జాగ్రత్తలు పాటించాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్‌కు చెందిన కారింగుల సుభాష్‌ ఓ ప్రయోగం చేశాడు... తన ఇంటి పరిసరాలను శుభ్రపరిచేందుకు.. బైక్‌ శానిటైజర్‌ రూపొందించి పిచికారీ చేసుకుంటున్నాడు. డీసీ మోటర్‌, నాజిల్, బ్యాటరీ, ఓ స్విచ్‌తో పాటు మీటరు వైరుని... బైక్‌ బ్యాటరీకి అనుసంధానం చేశాడు. అయిదులీటర్ల డబ్బాలో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని నింపి నాజిల్‌కు కనెక్షన్‌ ఇచ్చాడు. స్విచ్‌ ఆన్‌చేయగానే... రసాయనం పిచికారీ చేసేలా తయారు చేశాడు. దీనికి కేవలం 650 రూపాయల ఖర్చయ్యిందని వివరిస్తున్నాడు.

సుభాష్‌ ఓ ప్రైవేటు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. వైరస్‌ వ్యాపించకుండా తయారు చేసిన బైక్‌ శానిటైజర్‌ని..... కొన్ని మార్పులు చేస్తే...దోమలు నివారించే ఫాగింగ్‌ యంత్రంగా పనిచేస్తుందని వివరించాడు. బయట లభించే ఫాగింగ్‌ యంత్రాల కంటే అత్యంత తక్కువ ఖర్చు అవుతుందని తెలిపాడు.

రైతులు పొలాల్లో క్రిమిసంహారక మందులు చల్లటానికి సైతం శానిటైజర్‌ బైక్‌ ఉపయోగపడుతుందని.... సుభాష్‌ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: కరోనా బాధితుల పర్యవేక్షణకు టీటా- డీఆర్​డీవో ఒప్పందం

Last Updated : Jul 14, 2020, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.