ETV Bharat / sports

'ఈ విజయానికి దేశమంతా గర్విస్తుంది' - భవీనాకు అభినందనల వెల్లువ - భవీనా పటేల్​ పారాలింపిక్స్​

టోక్యో పారాలింపిక్స్​లో రజతం సాధించిన టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి భవీనా పటేల్​కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

President Kovind, PM Modi, Rahul Gandhi and others congratulate Bhavina Patel for winning a Silver medal at Tokyo Paralympics
'ఈ విజయంతో దేశం గర్విస్తుంది' - భవీనా పటేల్​కు అభినందనల వెల్లువ
author img

By

Published : Aug 29, 2021, 10:02 AM IST

Updated : Aug 29, 2021, 10:17 AM IST

పారాలింపిక్స్​ టేబుల్​ టెన్నిస్​లో రజత పతకాన్ని సాధించిన భారత క్రీడాకారిణి భవీనాబెన్​ పటేల్​కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వక్రీడల చరిత్రలోనే టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం వల్ల పలువురు ప్రముఖులు ఆమెను అభినందిస్తున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్​ వేదికగా భవీనాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  • Bhavina Patel inspires the Indian contingent and sportslovers winning silver at #Paralympics. Your extraordinary determination and skills have brought glory to India. My congratulations to you on this exceptional achievement.

    — President of India (@rashtrapatibhvn) August 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పారాలింపిక్స్​లో రజత పతక సాధించిన భవీనా పటేల్​.. టోక్యోలో ఉన్న భారత బృందంతో పాటు క్రీడాభిమానుల్లో స్ఫూర్తిని నింపింది. ఆమె అసాధారణ సంకల్పం, క్రీడానైపుణ్యాలు భారతదేశానికి కీర్తిని తెచ్చాయి. ఇంతటి గొప్ప విజయానికి మీకు(భవీనా) నా అభినందనలు".

- రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

  • టోక్యో పారాలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్‌కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #Paralympics pic.twitter.com/89CCkOUhR6

    — Vice President of India (@VPSecretariat) August 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"టోక్యో పారాలింపిక్స్​ మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో రజత పతకం సాధించిన భవీనా పటేల్‌కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను".

- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

  • The remarkable Bhavina Patel has scripted history! She brings home a historic Silver medal. Congratulations to her for it. Her life journey is motivating and will also draw more youngsters towards sports. #Paralympics

    — Narendra Modi (@narendramodi) August 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"భవీనా పటేల్​.. తన ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. పారాలింపిక్స్​లో దేశం కోసం రజత పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా ఆమెకు నా అభినందనలు. ఈ విజయం ఎంతోమంది యువతలో స్ఫూర్తిని నింపి క్రీడల వైపు ఆకర్షిస్తుంది".

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

"జాతీయ క్రీడా దినోత్సవం రోజున పారాలింపిక్స్​లో భారత్​ రజత పతకాన్ని సాధించింది. విశ్వక్రీడల్లో భవీనా విజయం ఓ అద్భుతమైన ప్రారంభం. పారా టేబుల్​ టెన్నిస్​లో తొలి పతకాన్ని దక్కించుకున్న మహిళా క్రీడాకారిణిగా ఘనత సాధించింది".

- అనురాగ్​ ఠాకూర్​, కేంద్ర క్రీడల మంత్రి

"టోక్యో పారాలింపిక్స్​లో రజత పతకం సాధించిన భవీనా పటేల్​కు అభినందనలు. మీ విజయాన్ని యావత్​ భారతావని ప్రశంసిస్తోంది. మీరు దేశ ప్రజలకు గర్వపడేలా చేశారు".

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

ఇదీ చూడండి.. చరిత్ర సృష్టించిన భవీనా.. భారత్​కు తొలి పతకం

Last Updated : Aug 29, 2021, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.