ETV Bharat / sports

Tokyo Paralympics: విధిని జయించి 'విజేత'గా నిలిచారు - nishad kumar PARALYMPICS MEDAL

కొన్ని కారణాల వల్ల దివ్యాంగులుగా మారిన వీళ్లు.. ఏ మాత్రం భయపడలేదు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డారు. కష్టపడి అభ్యసించారు. విశ్వ వేదికపై సత్తాచాటారు. ఏకంగా పారాలింపిక్స్​ పతకాలను కైవసం చేసుకున్నారు. దేశానికే గర్వకారణంగా నిలిచిన ఈ పారాలింపియన్లది ఒక్కొక్కరిది ఒక్కో కథ!

PARALYMPICS MEDAL WINNERS LIFE STORIES
పారాలింపిక్స్ మెడల్ లిస్ట్
author img

By

Published : Aug 30, 2021, 2:35 PM IST

టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్​లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఊహించిన దానికంటే పతకాల వేటలో దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు ఏడు పతకాలను భారత్​కు అందించిన క్రీడాకారుల గురించి ప్రత్యేక కథనం మీకోసం..​

సొంత రైఫిల్​ లేకుండానే..

2012లో కారు ప్రమాదం వల్ల కుర్చీకే పరిమితమైన అవని లేఖరా.. ఆ బాధను దిగమింగుకుని ఏదైనా రంగంలో పట్టు సాధించాలని అనుకుంది. అలా తొలుత ఆర్చరీ అనుకుని ఆ తర్వాత రైఫిల్​తో ప్రేమలో పడిపోయింది. సొంతంగా రైఫిల్ లేక కోచ్​ దగ్గర అరువు తెచ్చుకునే స్థితి నుంచి పారాలింపిక్స్​లో స్వర్ణ పతకం సాధించే స్థాయికి ఎదిగి, దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచింది.

కోచ్​ లేకుండానే పతకం..

ఈ పారాలింపిక్స్​ డిస్కస్​త్రోలో రజతం అందుకున్న యోగేశ్ కతునియా.. కోచ్​ లేకుండానే ఈ పతకం తెచ్చుకోవడం విశేషం. ఎనిమిదేళ్ల వయసులో పక్షవాతానికి గురైనప్పటికీ, ఏ మాత్రం నిరుత్సాహపడుకుండా కష్టపడ్డాడు. అయితే ఈ మెడల్​తో ఆగిపోనని, పారిస్​లో గోల్ట్​ సహా ప్రపంచ రికార్డు సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

.
.

జజారియా హ్యాట్రిక్ పతకాలు

ఎనిమిదేళ్ల వయసులో చెట్టెక్కుతూ.. విద్యుత్​ ప్రమాదానికి గురై ఎడమచేతిని కోల్పోయిన దేవేంద్ర జజారియా.. ఈసారి పారాలింపిక్స్​లో రజతం సాధించాడు. దీంతో మూడుసార్లు పారాలింపిక్స్​ మెడల్స్​ అందుకున్న ఘనత నమోదు చేశాడు. అంతకుముందు 2004, 2016 పారాలింపిక్స్​లో స్వర్ణాలు సాధించాడు.

.
.

రైతు కుటుంబం నుంచి..

పారాలింపిక్స్​లో రజతం గెల్చుకున్న హైజంపర్ నిషాద్‌ కుమార్​ది హిమాచల్‌ప్రదేశ్‌ రైతు కుటుంబం. 8 ఏళ్ల వయసులో పొలంలో ఆడుకుంటుండగా గడ్డి కోసే యంత్రంలో పడి అతడి కుడి చేయి తెగిపోయింది. అన్నింట్లోనూ చాలా చురుగ్గా ఉండే ఇతడు.. కోచ్‌ రమేశ్‌ ప్రోత్సాహంతో అథ్లెటిక్స్‌లోకి వచ్చాడు. మొదట 200 మీ, 400 మీ పరుగులో సాధన చేసేవాడు. ఆ తర్వాత హైజంప్‌కు ఆకర్షితుడయ్యాడు. ఒక చేయి లేకుండా హైజంప్‌ చేయడం చాలా కష్టం. కానీ నిషాద్‌ మాత్రం పెద్దగా ఇబ్బందిపడకుండానే జంప్‌ చేయగలిగేవాడు.

.
.

2013లో జాతీయ పాఠశాల క్రీడల్లో రజతం.. 2019 దుబాయ్‌ పారా గ్రాండ్‌ప్రి టోర్నీలో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. అదే ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్నాడు. ఆ తర్వాత రెండుసార్లు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినా నిషాద్‌ కుంగిపోలేదు. ప్రాక్టీస్‌ ఆపలేదు. రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తంగవేలు మరియప్పన్‌కు ట్రైనింగ్‌ ఇచ్చిన సత్యనారాయణ్‌ దగ్గర శిక్షణ పొందడం కూడా ఇతడికి కలిసొచ్చింది.

సైనికుడు కావాలని..

హరియాణా పారా ఒలింపియన్ వినోద్‌కుమార్‌ది భిన్న నేపథ్యం. ఆర్మీ కుటుంబంలో పుట్టిన అతడు చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలనే కలగన్నాడు. 2002లో లేహ్‌లో సైనిక శిక్షణ సందర్భంగా జారి పడడం వల్ల కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పదేళ్ల పాటు మంచానికే పరిమితం అయ్యాడు. ఆ తర్వాత క్రీడల రూపంలో అతడికి దేశసేవ చేయాలనే అవకాశం మళ్లీ దక్కింది.

.
.

2016 రియో పారాలింపిక్స్​ చూసి, సాయ్ శిక్షణా కేంద్రంలో చేరాడు. 2017, 18 జాతీయ టోర్నీల్లో కాంస్యం గెలవడం వల్ల వినోద్​ ఆత్మవిశ్వాసం పెరిగింది. 2019లో తొలిసారి పారిస్‌ గ్రాండ్‌ప్రి ఆడిన వినోద్‌.. అదే ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు టోక్యోలో కాంస్యం సొంతం చేసుకున్నాడు!

సరదాగా మొదలై పారాలింపిక్స్​ పతకం వరకు..

గుజరాత్​కు చెందిన భవీనా పటేల్​కు ఏడాది వయసున్నప్పుడు పోలియో వచ్చి, కాళ్లు చచ్చుబడిపోయాయి. 2004లో తండ్రి పోత్సాహం, ఫిట్​నెస్​ తెచ్చుకునేందుకు టీటీ నేర్చుకున్న ఈమెకు, ఆ తర్వాత ఆటే ప్రపంచమైంది. గతంలో జాతీయ ఛాంపియన్​గా నిలిచిన భవీనా.. 2016 రియో పోటీలకు ఎంపికైనప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల పాల్గొనలేకపోయింది. కానీ ఇప్పుడు టోక్యో పారాలింపిక్స్​లో మాత్రం రజతాన్ని ముద్దాడింది.

.
.

గుర్జార్ గర్జన

2015లో సుందర్ సింగ్ గుర్జార్.. తన స్నేహితుడి ఇంటిలో ఆడుకుంటుండగా, లోహపు రేకు తన ఎడమ చేతిపై పడింది. ఆ తర్వాత శస్త్రచికిత్స చేసినప్పటికీ అరిచేయిని తీసేయాల్సి వచ్చింది. దీని గురించి ఎలాంటి కలత చెందని అతడు.. 2017, 2019 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్స్​లో స్వర్ణాలతో మెరిశాడు. ఈ పారాలింపిక్స్​లో ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలో దిగాడు. కానీ జావెలిన్ త్రోలో కాంస్యం సాధించి అద్భుతం చేశాడు.

.
.

ఇవీ చదవండి:

Conclusion:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.