టోక్యో పారాలింపిక్స్‌లో బంగారు పతక విజేతలు అవని లేఖరా(Avani Lekhara), సుమిత్ అంటిల్(Sumith Antil)లకు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఏడాదిపాటు ఉచిత విమానయానాన్ని అందించనుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో వీరిద్దరూ సెప్టెంబర్ 1 నుంచి 2022 ఆగస్టు 31 వరకు ఉచిత ప్రయాణం చేయొచ్చని తెలిపింది.
"అవని, సుమిత్‌ల ప్రదర్శన చూసి మేం గర్వపడుతున్నాం. వీరు దేశం గర్వపడేలా చేశారు. గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇది అంత సులభం కాదని మాకు తెలుసు. మీ ఇద్దరికీ ఓ సంవత్సరం పాటు ఇండిగోలో ఉచిత విమానాయానాన్ని అందించాలనుకుంటున్నాం."
-రోనోజోయ్ దత్తా, ఇండిగో ఎయిర్వేస్ డైరెక్టర్, సీఈఓ.
సుమిత్ అంటిల్(Sumith Javelin Throw).. జావెలిన్ త్రో(Sumit Throw)లో చరిత్ర సృష్టించాడు. ఎఫ్64 విభాగంలో ఈటెను 68.55 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. తొలి రౌండ్లోనే 66.95 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సాధించాడు సుమిత్. ఐదో రౌండ్లో 68.55 మీట్లర్ల దూరం విసిరి మరోసారి తన రికార్డును తానే బద్దలుకొట్టి వరల్డ్ రికార్డుకెక్కాడు.
ఇక ఎయిర్‌రైఫిల్ విభాగంలో భారత మహిళా షూటర్ అవని లేఖరా(Avani Lekhara) స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో సత్తా చాటిన ఆమె.. టోక్యో పారాఒలింపిక్స్‌లో తొలి స్వర్ణాన్ని భారత్‌కు అందించింది.
ఇవీ చదవండి: