ETV Bharat / sports

ఏడాది తర్వాత కోర్టులోకి ఫెదరర్​-ఇవాన్స్​తో ఢీ - స్విస్​ టెన్నిస్ స్టార్

ఏడాదికి పైగా విరామం తర్వాత తిరిగి టెన్నిస్​ రాకెట్ పట్టనున్నాడు స్విస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్​. ఖతార్ ఓపెన్​లో భాగంగా బ్రిటన్ ఆటగాడు డానియల్​ ఇవాన్స్​తో తలపడనున్నాడు.

Watch | Qatar Open: Roger Federer to face Daniel Evans in his comeback match
ఏడాది తర్వాత కోర్టులోకి ఫెదరర్​.. దోహా ఓపెన్​లో ఇవాన్స్​తో ఢీ
author img

By

Published : Mar 10, 2021, 11:49 AM IST

13 నెలల పాటు టెన్నిస్​కు దూరంగా ఉన్న స్టార్​ ప్లేయర్​ రోజర్​ ఫెదరర్ తిరిగి కోర్టులోకి అడుగుపెట్టనున్నాడు. ఖతార్​ ఓపెన్​లో భాగంగా తన రెండో రౌండ్​లో బ్రిటన్​ ప్లేయర్​ డానియల్​ ఇవాన్స్​తో తలపడనున్నాడు ఫెదరర్.

గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్​ సందర్భంగా గాయపడిన ఫెదరర్​.. తన కుడి మోకాలికి రెండు శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. దోహ ఖతార్​ ఓపెన్​ను ఇది వరకు మూడు సార్లు కైవసం చేసుకున్నాడు ఈ స్విస్ దిగ్గజం.

బ్రిటన్​ ప్లేయర్​ ఇవాన్స్​ ఇప్పటికే తన తొలి రౌండ్​లో ఫ్రెంచ్​ ఆటగాడు జెరెమీ చార్డీపై విజయం సాధించాడు. 6-4, 1-6, 6-2 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు.

ఇదీ చదవండి: 'ఆ తర్వాతే భారత టీ20 ప్రపంచ కప్​​ జట్టుపై నిర్ణయం '

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.