ETV Bharat / sports

యూఎస్​ ఓపెన్​లో అమ్మల ఆధిపత్యం

యూఎస్​ ఓపెన్​ మహిళల సింగిల్స్​లో సెరెనా విలియమ్స్​, అజరెంకా, పిరంకోవా ప్రీ క్వార్టర్స్​కు చేరారు. బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత కూడా టెన్నిస్​ కెరీర్​ కొనసాగిస్తున్న వీళ్లు.. తమ ఆటతో అదరగొడుతున్నారు. మరోవైపు రెండో సీడ్​ కెనిన్​ కూడా ముందంజ వేసింది. మాజీ ఛాంపియన్​ కెర్బర్​ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్​లో థీమ్​, మెద్వదెవ్​ మూడో రౌండ్​ దాటారు.

us open results 2020 latest news
యూఎస్​ ఓపెన్​లో అమ్మల ఆధిపత్యం
author img

By

Published : Sep 7, 2020, 6:40 AM IST

యూఎస్‌ ఓపెన్‌లో టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలో దిగిన మాజీ నంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ ఆ దిశగా మరో అడుగు వేసింది. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో ఈ అమెరికా తార 2-6, 6-2, 6-2 తేడాతో తమ దేశానికే చెందిన స్టీఫెన్స్‌పై విజయం సాధించింది. 26వ సీడ్‌ స్టీఫెన్స్‌తో మ్యాచ్‌లో మూడో సీడ్‌ సెరెనా తొలి సెట్‌ కోల్పోయినప్పటికీ తిరిగి గొప్పగా పుంజుకుని గెలుపు సొంతం చేసుకుంది. మరో అమ్మ అజరెంకా (బెలారస్‌) 6-4, 6-2తో స్వియాటెక్‌ (పోలాండ్‌)పై నెగ్గింది. బిడ్డకు జన్మనివ్వడం కోసం ఆటకు దూరమై మూడేళ్ల విరామం తర్వాత తొలి టోర్నీ ఆడుతున్న పిరంకోవా (బల్గేరియా) 6-4, 6-1తో 18వ సీడ్‌ వెకిచ్‌ (క్రొయేషియా)పై గెలిచింది.

us open results 2020 latest news
సెరెనా విలియమ్స్​

రెండో సీడ్‌ కెనిన్‌ (యుఎస్‌ఏ) 7-6 (7-4), 6-3తో జబెర్‌ (ట్యూనీషియా)పై నెగ్గి ముందంజ వేసింది. కార్నెట్‌ (ఫ్రాన్స్‌)తో మ్యాచ్‌లో ఏడో సీడ్‌ కీస్‌ (యుఎస్‌ఏ) గాయం కారణంగా మధ్యలో తప్పుకుంది. మాజీ ఛాంపియన్‌ కెర్బర్‌ 1-6, 2-6తో జెనిఫర్‌ బ్రాడీ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. మిగతా మ్యాచ్‌ల్లో సకారి (గ్రీస్‌) 6-3, 6-1తో అనిసిమోవా (యుఎస్‌ఏ)పై, మార్టిన్స్‌ (బెల్జియం) 7-5, 6-1తో మెక్‌నలీ(యుఎస్‌ఏ)పై, ముచోవా (చెక్‌రిపబ్లిక్‌) 6-3, 2-6, 7-6 (9-7)తో క్రిస్టీ (రొమేనియా)పై నెగ్గారు.

us open results 2020 latest news
అజరెంకా

సీడెడ్ల జోరు

పురుషుల సింగిల్స్‌లో సీడెడ్‌ క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. రెండో సీడ్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6-2, 6-2, 3-6, 6-3తో సిలిచ్‌ (క్రొయేషియా)పై గెలిచి ప్రీక్వార్టర్స్‌ చేరాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6-3, 6-3, 6-2తో వోల్ఫ్‌ (యుఎస్‌ఏ)పై పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించాడు. ఆరో సీడ్‌ బెరెట్టిని (ఇటలీ) 6-4, 6-4, 6-2తో రూడ్‌ (నార్వే)ను ఓడించాడు. మరోవైపు ఎనిమిదో సీడ్‌ బటిస్టా అగట్‌ (స్పెయిన్‌)కు పాస్పిసిల్‌ (కెనడా) షాకిచ్చాడు. ప్రపంచ 11వ ర్యాంకర్‌ అగట్‌ 5-7, 6-2, 6-4, 3-6, 2-6తో 94వ ర్యాంకర్‌ పాస్పిసిల్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. పదకొండో సీడ్‌ కచనోవ్‌ (రష్యా) 4-6, 6-0, 6-4, 3-6, 1-6తో డిమినార్‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడాడు. పదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 6-0, 6-4, 6-0తో కరుసో (ఇటలీ)ను చిత్తుచేశాడు. అగర్‌ (కెనడా), టియోఫో (యూఎస్‌ఏ) కూడా ముందంజ వేశారు.

ప్రీక్వార్టర్స్‌లో బోపన్న జోడీ

యూఎస్‌ ఓపెన్‌ బరిలో మిగిలిన ఏకైక భారత ఆటగాడు రోహన్‌ బోపన్న.. కెనడా భాగస్వామి షపోవలోవ్‌తో కలిసి పురుషుల డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. రెండో రౌండ్లో బోపన్న- షపోవలోవ్‌ జోడీ 4-6, 6-4, 6-3తో ఆరో సీడ్‌ కెవిన్‌- మైల్స్‌ (జర్మనీ) జంటకు షాకిచ్చింది. ర్యాంకింగ్స్‌లో తనకంటే మెరుగైన జర్మనీ ద్వయంపై బోపన్న జంట సత్తా చాటింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.