టెన్నిస్ అసోసియేషన్ (ఏటీపీ) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో రోజర్ ఫెదరర్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇటీవల మయామీ సిరీస్ నెగ్గిన రోజర్.. కెరీర్లో 101వ టైటిల్ అందుకున్నాడు. సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ అగ్రస్థానానికి ఎగబాకాడు. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రెండోస్థానంలో ఉన్నాడు.
రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ సిరీస్లో ఫెదరర్ని ఓడించిన డొమినిక్ థీమ్ ఐదో ర్యాంకు దక్కించుకున్నాడు. గ్రీస్ స్టార్ ఆటగాడు స్టెఫానో తన కెరీర్ ఉత్తమమైన ఎనిమిదో ర్యాంకు సాధించాడు. కెనడా కుర్రాడు డెనీస్ షపోవాలోవ్ టాప్ 20లో అడుగుపెట్టాడు.
టెన్నిస్ టాప్ 5లో చోటు దక్కించుకున్నావారు..
- నొవాక్ జకోవిచ్(సెర్బియా)
- రఫెల్ నాదల్(స్పెయిన్)
- అలెగ్జాండర్ జ్వెరేవ్(జర్మనీ)
- రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్)
- డొమినిక్ థీమ్(ఆస్ట్రియా)