యుఎస్ ఓపెన్‌లో (US Open 2021) టాప్‌సీడ్ జకోవిచ్ (Novak Djokovic) టైటిల్ వేట మొదలైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అతను 6-1, 6-7 (5-7), 6-2, 6-1 తేడాతో హోల్గర్ రూన్‌పై (డెన్మార్క్) నెగ్గాడు. ఈ ఏడాది ఇప్పటికే మూడు గ్రాండ్‌స్లామ్‌లు (Grand Slam) గెలిచి, ఈ టోర్నీలో ఫేవరేట్‌గా అడుగుపెట్టిన జకోవిచ్ (Novak Djokovic US open).. రెండో సెట్లో మినహా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ఈ మ్యాచ్‌లో 17 ఏస్‌లు సంధించిన జకో.. 55 విన్నర్లు కొట్టాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6-4, 7-5, 6-2తో సామ్‌పై (యుఎస్) గెలిచాడు.
ఆరో సీడ్ బెరెటిని (ఇటలీ) 7-6 (7-5), 7-6 (9-7), 6-3తో చార్డీపై (ఫ్రాన్స్), ఏడో సీడ్ షపోవలోవ్ (కెనడా) 6-2, 6-2, 6-3తో డెల్బానిస్పై (అర్జెంటీనా) గెలిచారు. హాబర్ట్ (పోలెండ్), సిన్నర్ (ఇటలీ), నిషికోరి (జపాన్), మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) కూడా ముందంజ వేశారు. కచనోవ్ (రష్యా), ఫాగ్నిని (ఇటలీ), గోఫిన్ (బెల్జియం), డెమినార్ (ఆస్ట్రేలియా) అన్‌సీడెడ్ ఆటగాళ్ల చేతుల్లో ఓడారు.
మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ ఒసాకా (జపాన్) (Osaka), 9వ సీడ్ ముగురుజ (స్పెయిన్) (Muguruza) మూడో రౌండ్లో అడుగుపెట్టారు. డానిలోవిచ్ (క్రొయేషియా) నుంచి ఒసాకాకు వాకోవర్ లభించగా.. ముగురుజ 6-4, 6-2తో పెట్కోవిచ్పై (జర్మనీ) నెగ్గింది. టాప్‌సీడ్ ఆష్లీ బార్టీ రెండో రౌండ్లో అడుగుపెట్టింది. తొలి రౌండ్లో ఈ ఆస్ట్రేలియా భామ 6-1, 7-6 (9-7)తో జొనారెవాపై (రష్యా) గెలిచింది. నాలుగో సీడ్ ప్లిస్కోవా (చెక్), ఆరో సీడ్ ఆండ్రెస్కూ (కెనడా), స్వైటెక్ (పోలెండ్), క్విటోవా (చెక్), బెన్సిచ్ (స్విట్జర్లాండ్) కూడా శుభారంభం చేశారు.
ఇదీ చూడండి: Tokyo Paralympics: భారత జోరుకు విరామం- నిరాశపరిచిన అథ్లెట్లు