ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో రష్యా టెన్నిస్ క్రీడాకారుడు డానియెల్ మెద్వెదెవ్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. అదే దేశానికి చెందిన ఆండ్రీ రుబ్లేవ్‌పై మూడు వరుస సెట్ల(7-5, 6-3, 6-2)లో మెద్వెదెవ్ గెలుపొందాడు. దీంతో మెద్వెదెవ్ వరుసగా 19వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రీడాకారులిద్దరూ గతేడాది జరిగిన యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో తలపడడం విశేషం. అందులోనూ మెద్వెదెవ్ పైచేయి సాధించాడు.
మహిళల సింగిల్స్ విభాగంలో జెన్నిఫర్ బ్రాడీ సెమీఫైనల్‌కు చేరింది. అమెరికాకు చెందిన జెస్సికాను (4-6, 6-2, 6-1) ఓడించింది. గురువారం జరగనున్న సెమీస్‌లో కరోలినాతో జెస్సికా తలపడనుంది. ఇందులో గెలుపొందిన వారు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు వెళ్తారు.
ఇదీ చూడండి: ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లోకి సెరెనా, జకోవిచ్