యూఎస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న, డెనిస్ షాపోవాలోవ్ జోడీ.. క్వార్టర్‌కు చేరుకుంది. కెవిన్ క్రావిట్జ్, ఆండ్రియాస్ మీస్ ద్వయంపై రెండో రౌండ్లో గంటన్నర పైగా పోరాడి చివరికి విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోయినా.. తర్వాత రెండు సెట్లలో(4-6, 6-4, 6-3) ఆధిక్యం సాధించి ముందడుగు వేసింది.

నాలుగో రౌండ్‌కు సెరెనా, థీమ్
మూడో రౌండ్లో డొమినిక్ థీమ్(ఆస్ట్రియా), మారిక్ సిలిక్ను 6-2, 6-2, 3-6, 6-3 తేడాతో ఓడించి, నాలుగో రౌండ్‌కు అర్హత సాధించాడు.

23 సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న సెరెనా విలియమ్స్ కూడా నాలుగో రౌండ్‌కు చేరుకుంది. శనివారం, మూడో రౌండ్లో స్లోన్ స్టీఫెన్స్‌పై 2-6, 6-2, 6-2 తేడాతో విజయం సాధించింది.