ETV Bharat / sports

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో కరోనా కలకలం - ఆస్ట్రేలియా ఓపెన్​

ఆస్ట్రేలియన్ ఓపెన్​ సహాయక సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకింది. వారి వివరాలను నిర్వహకులు వెల్లడించలేదు. ఫలితంగా టోర్నీలో పాల్గొనాల్సిన మిగతా ఆటగాళ్లు, సిబ్బంది స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

aus open
ఆస్ట్రేలియా ఓపెన్​
author img

By

Published : Jan 16, 2021, 11:33 AM IST

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో కరోనా కేసులు వచ్చాయి. టోర్నీలో భాగస్వామ్యమైన ఇద్దరికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహణాధికారి ఒకరు తెలిపారు. వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఇటీవల పూర్తయిన ఆస్ట్రేలియన్ ఓపెన్​ క్వాలిఫయర్స్​లో అర్హత సాధించిన ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది.. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో అతిథ్య దేశానికి చేరుకున్నారు. వీరిందరికీ అక్కడ చేసిన కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరికి వైరస్​ సోకినట్లు తేలింది. దీంతో ఆ విమానంలో ప్రయాణం చేసిన మిగతావారందరినీ 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి పంపించారు నిర్వహకులు. ఫిబ్రవరి 8 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్​ ప్రారంభం కానుంది.

అంతకముందు చేసిన వైద్య పరీక్షల్లో మాజీ ప్రపంచ నంబర్‌ వన్ ఆండీ ముర్రే కరోనా బారిన పడినట్లు తేలింది. దీంతో అతడు ఆడేది అనుమానంగా మారింది. ప్రస్తుతం లండన్‌లోని తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు ముర్రే.

ఇదీ చూడండి: త్వరలో ఆస్ట్రేలియన్ ఓపెన్.. క్వారంటైన్​లో ప్లేయర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.