టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్లు(IND vs NZ T20 clash). ఆదివారం(అక్టోబర్ 31) దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా బ్యాటర్లను కట్టడి చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(Boult News) తెలిపాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమ్ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లను షహీన్‌షా అఫ్రిది(Shaheen Afridi vs India) కట్టడి చేసిన విధానాన్ని తాను నిశితంగా పరిశీలించినట్లు పేర్కొన్నాడు. అదే టెక్నిక్‌ను ఆదివారం జరగనున్న మ్యాచ్‌లోనూ తాను అనుసరిస్తానని తెలిపాడు.
"షహీన్ బౌలింగ్ చేసిన విధానాన్ని బాగా గమనించాను. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రానున్న మ్యాచ్‌లో నేను కూడా అదే తరహాలో బౌలింగ్ చేయగలననిపిస్తోంది. టీమ్ఇండియా జట్టులో మేటి బ్యాటర్లున్నారు. బౌలర్‌గా నా ఫోకస్ అంతా వారిని కట్టడి చేయడంపైనే ఉంటుంది."
--ట్రెంట్ బౌల్ట్, కివీస్ పేసర్.
టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడం సహా వారి బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేయడం ముఖ్యమని కివీస్ పేసర్ బౌల్ట్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో మ్యాచ్ సవాల్‌గా ఉంటుందని, ఈ మ్యాచ్ కోసం కివీస్ ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నాడు. గత మ్యాచ్‌లో గాయపడ్డ గప్తిల్ కూడా ఆడే అవకాశాలున్నాయని తెలిపాడు. ఇరు జట్లూ బలంగానే ఉన్నాయని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలుత భారత్‌పై ఘన విజయం సాధించిన పాక్(IND vs PAK T20 Match), రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను(PAK vs NZ T20) ఓడించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకూ కీలకం కానుంది. ఈ పోరులో గెలిచిన వాళ్లకే సెమీస్ అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: