ETV Bharat / sports

వచ్చే నెలలో బాక్సింగ్​ రింగ్​లోకి​ విజేందర్ ​​ - భారత ప్రొఫెషనల్​ బాక్సర్​ విజేందర్​ సింగ్​

భారత ప్రొఫెషనల్​ బాక్సర్​ విజేందర్​ సింగ్​ వచ్చే నెలలో బాక్సింగ్​ రింగ్​లోకి అడుగుపెట్టనున్నాడు. కరోనా వల్ల ఏడాది కాలంగా ఆటకు దూరమైన అతడు తిరిగి పోటీల్లోకి దిగనున్నాడు.

Vijender set for return to ring next month, opponent to be announced soon
వచ్చే నెలలో బాక్సింగ్​ రింగ్​లోకి​ విజేందర్ ​​
author img

By

Published : Feb 22, 2021, 3:39 PM IST

భారత ప్రొఫెషనల్​ బాక్సర్​ విజేందర్ సింగ్ తిరిగి రింగ్​లోకి అడుగుపెట్టనున్నాడు. కొవిడ్​ కారణంగా ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న అతడు.. వచ్చే నెలలో భారత్​లో జరుగుబోయే పోటీల్లో బరిలోకి దిగుతాడని ప్రమోటర్లు పేర్కొన్నారు.

"ఎట్టకేలకు విజేందర్​తో పోటీకి దిగబోయే ప్రత్యర్థి పేరును, తేదీని, వేదికను ప్రమోటర్లు నిర్ణయిస్తారు. అతడు మార్చి నెలలో తిరిగి రింగ్​లోకి అడుగుపెట్టనున్నాడు. విజేందర్​ ఇప్పటికే 12 వరుస విజయాలతో ఉన్నాడు. ఆ రికార్డును కొనసాగించేందుకు పోటీలోకి దిగనున్నాడు" అని ఐఓఎస్​ బాక్సింగ్​ ప్రమోషన్స్​ ప్రకటించింది.

విజేందర్​ చివరిసారిగా.. 2019 నవంబర్​లో దుబాయ్​ వేదికగా జరిగిన డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్​ మిడిల్​వెయిట్​ ఛాంపియన్​ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ గేమ్​లో ప్రత్యర్థి ఛార్లెస్​ ఆడమ్​ను ఓడించి వరుసగా 12వ విజయాన్ని నమోదు చేశాడు.

"కొవిడ్​ అనంతరం తిరిగి బాక్సింగ్​లోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. నా ఫిట్​నెస్​ను మెరుగుపరుచుకోవడం కోసం గత నెల రోజులుగా కష్టపడుతున్నాను. ప్రత్యర్థి ఎవరనేది అసలు విషయం కాదు. నా దృష్టంతా విజయాల పరంపరను కొనసాగించడమే."

-విజేందర్​ సింగ్​, భారత ప్రొఫెషనల్​ బాక్సర్​.

ఇదీ చదవండి: 'ధోనీతో కలిసి ట్రోఫీ తీసుకోవాలనేది కోరిక!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.