ETV Bharat / sports

మార్చి 25 నుంచి టోక్యో ఒలింపిక్స్ టార్చ్ రిలే - Tokyo Olympic

ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ టార్చ్ రిలే మార్చి 25 నుంచి జపాన్​లో ప్రారంభంకానుంది. ఈ మేరకు నిర్వహణ కమిటీ ప్రకటన విడుదల చేసింది.

Tokyo Olympic torch relay plans to kick off in one month
మార్చి 25 నుంచి టోక్యో ఒలింపిక్స్ టార్చ్ రిలే
author img

By

Published : Feb 25, 2021, 11:34 AM IST

టోక్యో ఒలింపిక్స్​ టార్చ్ రిలే మార్చి 25న ప్రారంభంకానుంది. జపాన్​లోని ఫుకుషిమాలోని నరహా పట్టణంలో జ్యోతిని వెలిగిస్తారు. అప్పటి నుంచి జులై 23న టోక్యోలోని జాతీయ స్టేడియంలో విశ్వక్రీడల ప్రారంభ కార్యక్రమం ఈ రిలేను అక్కడ తిప్పుతారు.

గతేడాది గ్రీస్ నుంచి జ్యోతి టోక్యో తీసుకొచ్చాక రిలే ప్రారంభమయ్యే ముందే కరోనా కారణంగా ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే దాదాపు 10వేల మంది టార్చ్​బేరర్లు(జ్యోతిని తిప్పేవారు), సిబ్బంది, అభిమానులకు కొన్ని నిబంధనలు విధించారు నిర్వాహకులు. వాటిని గురువారం విడుదల చేశారు.

"ఎవరూ అరవడం, కేరింతలు కొట్టడానికి వీలులేదు. చప్పట్లు కొడుతూ ఉత్సహాపరచవచ్చు. భౌతిక దూరం నిబంధన పాటించాల్సి ఉంటుంది. టార్చ్​బేరర్లకు మాస్కు తప్పనిసరి కాదు, కానీ మిగిలినవారు విధిగా ధరించాలి."

-యుకిహికో నునొముర, నిర్వాహక కమిటీ వైస్ డైరక్టర్ జనరల్

టార్చ్​ రిలే నిర్వహణ ప్రకటనతో ఒలింపిక్స్​ జరగడంపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ విశ్వక్రీడలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: 'ఒలింపిక్స్​ ఆటగాళ్లకు త్వరలోనే కొవిడ్ టీకా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.