టోక్యో ఒలింపిక్స్-2020కు సంబంధించిన వేదికల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. 188 మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఓ జిమ్నాస్టిక్ వేదికను జపాన్ ప్రభుత్వం.. మంగళవారం ఆవిష్కరించింది. సంప్రదాయ పద్ధతుల్లో ఈ వేదికను కలపతోనే నిర్మించింది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కలపను సేకరించింది.


టోక్యోలోని అరియకే జిమ్నాస్టిక్స్ సెంటర్ వద్ద 2,300 క్యూబిక్ మీటర్ల కలపతో ఈ వేదికను నిర్మించారు. జపాన్ సంప్రదాయ పద్ధతుల్లో దీనిని రూపొందించాడు ప్రముఖ ఆర్కిటెక్ట్ కెంగో కుమా. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా వేదికను నిర్మించాడు. ఎత్తయిన పైభాగం కోసం సిడార్(దేవదారు) కలపను వినియోగించాడు. ఇక్కడి 12వేల మంది కూర్చునే వీలుంది.


ఒలింపిక్ స్టేడియం ప్రధాన ద్వారం చూడగానే మైమరిచిపోయేలా రూపొందించారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రదేశంలో ఈ మైదానాన్ని నిర్మించారు. ఒలింపిక్ క్రీడలు అయిపోగానే దాన్ని ఎగ్జిబిషన్ సెంటర్‌గా మార్చనున్నారు.