ETV Bharat / sports

స్విస్​ ఓపెన్​కు రంగం సిద్ధం.. సింధు, సైనా ఈ సారైనా.. - రేపటి నుంచే స్విస్​ ఓపెన్

Swiss Open 2022: స్విస్​ ఓపెన్​ బ్యాడ్మింటన్‌ టోర్నీ మంగళవారం(మార్చి 22) నుంచి ప్రారంభంకానుంది. ఈ మెగాఈవెంట్​లో టైటిల్ ఫేవరెట్​గా బరిలోకి దిగుతున్న భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్​, కిదాంబి శ్రీకాంత్​.. సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్నారు. కాగా, భారతయువ కెరటం లక్ష్యసేన్‌ ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు.

స్విస్​ ఓపెన్​ 2022
swiss open 2022
author img

By

Published : Mar 21, 2022, 6:42 PM IST

Swiss Open 2022: రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు, ప్రపంచ ఛాంపియన్​ రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్​.. మరో టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. స్విస్​ ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీ మంగళవారం(మార్చి 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగాఈవెంట్​తోనైనా తమ టైటిళ్ల కరవుకు తెరదించాలని వీరిద్దరూ పట్టుదలతో ఉన్నారు. ​మరోవైపు.. జర్మన్​ ఓపెన్​, ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్​లో రన్నరప్​గా నిలిచిన లక్ష్యసేన్​ ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. కాగా, గత రెండు వారాల్లో జరిగిన జర్మన్​ ఓపెన్​, ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్​​లో స్టార్​ షట్లర్లు సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్​ క్వార్టర్​ ఫైనల్స్​కు కూడా చేరుకోలేకపోయారు.

మహిళ సింగిల్స్​ మొదటి రౌండ్​లో సింధు.. డెన్మార్క్​కు చెందిన లైన్​ హెజ్​మార్క్​తో తలపడనుండగా.. మరో స్టార్​ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​ చైనాకు చెందిన ఏడో సీడ్​ వాంగ్​ జీ యీతో ఆడనుంది. ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్​లో సెమీస్​కు చేరి ఓటమి పాలైన గాయత్రి గోపీచంద్​ పుల్లెల, జోలీ జోడీ తమ మొదటి రౌండ్​లో థాయ్​లాండ్​కు చెందిన జోంగ్​కొల్పాన్​, రవింద ప్రజాంగజై ద్వయాన్ని ఎదుర్కోనున్నారు.

పురుషుల సింగిల్స్​ తొలిరౌండ్​లో క్వాలిఫయిర్1తో కిదాంబి శ్రీకాంత్​, ప్రణయ్​తో సాయి ప్రణీత్​, క్వాలిఫయర్3తో పారుపల్లి కశ్యప్​ అమీతుమీ తేల్చుకోనున్నారు. పురుషుల డబుల్స్​లో సాత్విక్​ సాయిరాజు-చిరాగ్​ శెట్టి జోడీ.. ఇండోనేషియాకు చెందిన మహమ్మద్​ షహోబిల్​-బగాస్​ మౌలానా జోడీతో తలపడనున్నారు. అర్జున్​, ధ్రువ్​ కపిల, కృష్ణ ప్రసాద్​ గరగ, విష్ణువర్దన్​ గౌడ్​ పంజలా కూడా పురుషుల డబుల్స్​లో ఆడనున్నారు.

ఇదీ చదవండి: ఫుట్​బాల్ మ్యాచ్​లో గ్రెనేడ్లతో విధ్వంసం.. మెస్సీ జట్టుపైనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.