టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 300 ఫోర్లు కొట్టిన బ్యాటర్ జాబితాలో హిట్‌మ్యాన్ చేరాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఈ రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ 103 ఇన్నింగ్స్‌ల్లో 325 ఫోర్లతో టాప్‌లో ఉన్నాడు. రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు.
భారత్ తరఫున రోహిత్ తొలి స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ(298) ఫోర్లతో రెండో స్థానంలో నిలిచాడు. 191 ఫోర్లతో శిఖర్ ధావన్ మూడో స్థానంలో ఉన్నాడు. రెండో టీ20కి ముందు.. రోహిత్ ఖాతాలో 118 ఇన్నింగ్స్‌ల్లో 298 ఫోర్లు, 155 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. దీంతో మొత్తం 301 ఫోర్లు కొట్టాడు రోహిత్.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్: టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్.. బౌలింగ్ ఎంచుకొని టీమ్‌ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలవాలని చూస్తోంది.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.
ఇంగ్లాండ్ జట్టు: జేసన్ రాయ్, జాస్ బట్లర్ (కెప్టెన్, కీపర్), డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, సామ్ కరణ్, డేవిడ్ విల్లే, క్రిస్ జోర్డాన్, రిచర్డ్ గ్లీసన్, మాథ్యూ పార్కిన్‌సన్.
ఇదీ చదవండి: జడేజా చెన్నైని వీడనున్నాడా?.. క్లారిటీ ఇచ్చేసిన సీఎస్కే