రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు ఓ ప్రముఖ ఆటగాడి పేరు పెట్టాలని సూచించింది మహిళా రెజ్లర్ బబితా ఫొగాట్. క్రీడా పురస్కారాల్లో ఉన్నతమైన దీనికి రాజకీయ నాయకుల కంటే క్రీడా ప్రముఖల పేర్లు పెట్టడం ఉత్తమమని అభిప్రాయపడింది.
"క్రీడా అవార్డులకు రాజకీయ నాయకుడి పేరు కాకుండా ప్రఖ్యాత ఆటగాళ్ల పేర్లను పెడితే బాగుంటుంది. ఓ క్రీడాకారుడికి ఇచ్చే పురస్కారానికి రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు అని మార్చాలన్న సూచన మీకు ఎలా వచ్చింది"
- బబితా ఫొగాట్, భారత మహిళా రెజ్లర్
ఈ విషయంపై కొందరు విలేకర్లు అడిగిన ప్రశ్నలకు బబితా సమాధానమిచ్చింది. "ఖేల్‌రత్న అవార్డుకు రాజీవ్‌గాంధీ పేరు పెట్టారు. దానికి బదులుగా ఏదైనా ఆటగాడి పేరు పెట్టి ఉండే అది మరింత సముచితంగా ఉండేది. మన దేశంలో ఒలింపిక్స్ పతకాలు సాధించిన వాళ్లతో పాటు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన క్రీడాకారులు కూడా ఉన్నారు. అలాంటి వారి పేర్లతో అవార్డులను అందిస్తే క్రీడాకారులకు గర్వంగా ఉండటం సహా వారికి స్ఫూర్తినిస్తుంది" అని బబితా వెల్లడించింది.
బబితా ఫొగాట్‌ను హరియాణా రాష్ట్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖకు డిప్యూటీ డైరెక్టర్‌గా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులో నియమించింది. ఆమె తండ్రి మహావీర్ ఫొగాట్‌తో కలిగి గతేడాది ఈమె భారతీయ జనతా పార్టీలో చేరింది.