ఫార్ములావన్ రేసింగ్ దిగ్గజం మైఖేల్ షుమాకర్ జీవితంపై త్వరలోనే ఓ డాక్యుమెంటరీ రానుంది. ఏడుసార్లు ఎఫ్1 విశ్వవిజేతగా నిలిచాడు ఈ జర్మన్ స్టార్. 2013లో స్కీయింగ్ చేస్తూ తీవ్ర ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటినుంచి అతడు బయటి ప్రపంచానికి కనపడలేదు. కుటుంబసభ్యులు షుమాకర్‌కు జెనివాలోనే చికిత్స అందిస్తున్నారని సమాచారం.
మైఖేల్ వెక్-బ్రూనో కమర్టన్స్ ఈ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. షుమాకర్ భార్య వారికి తమ ప్రైవేట్ రికార్డింగ్‌లను ఇచ్చినట్లు తెలుస్తోంది. దిగ్గజ రేసర్ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్న అభిమానులకు ఈ డాక్యుమెంటరీ పెద్ద ఉపశమనం కలిగించనుంది. అయితే ఈ లఘుచిత్రం.. గత డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉన్నా... కరోనా కారణంగా ఆలస్యమైనట్లు సమాచారం.
ఇదీ చూడండి: ఎఫ్2 టైటిల్‌ను గెలుచుకున్న మిక్ షుమాకర్