PV Sindhu Indonesia Open : గత కొంత కాలంగా టైటిల్ దాహంతో ఉన్న భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు.. మంగళవారం ప్రారంభమైన ఇండోనేసియా ఓపెన్వరల్డ్ టూర్ సూపర్ 1000 ఈవెంట్లో తొలి మ్యాచ్ గెలిచింది. తన ప్రత్యర్థి జార్జియా మారిస్కా టూన్జుంగ్ (Gregoria Mariska Tunjung)(ఇండోనేసియా)పై 38 నిమిషాల్లో 21-19, 21-15 రెండు వరుస గేమ్‌లలో విజయం సాధించి.. ప్రీ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. సింధు ఆడిన చివరి రెండు ఈవెంట్లలో ఆమెకు నిరాశే ఎదురైంది. టైటిళ్లు సాధించలేక వెనుదిరిగింది.
వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి పడిపోయిన సింధూకు.. మొదట్లో జార్జియా 9-7తో లీడ్ సాధించి గట్టి పోటీ ఇచ్చింది. ఆ తర్వాత పుంజుకున్న సింధు.. జార్జియా చేసిన తప్పిదాల వల్ల 11-10తో లీడ్‌లోకి వచ్చి.. మొదటి గేమ్‌లో గెలిచింది. ఈ ఉత్సాహంతో రెండో గేమ్‌లో మొదటి నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో రెండో గేమ్‌లోనూ విజయం సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. తదుపరి మ్యాచ్‌లో సింధు టా జు యింగ్ (Tai Tzu Ying) (తైవాన్) ద్వారా సింధూకు గట్టి పోటీ ఎదురుకానుంది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మాడ్రిడ్ మాస్టర్స్ ఫైనల్, మలేసియన్ మాస్టర్స్ సెమీఫైనల్స్‌లో మూడు గేమ్‌ల్లో సింధూ, జార్జియా తలపడ్డారు. ఈ మూడు గేమ్‌ల్లో సింధు ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో జార్జిపై సింధు గెలవడం వల్ల.. ఈ ఇండోనేసియా టైటిల్‌పై ఆశలు చిగురించాయి.
మరోవైపు.. ఫుల్ ఫామ్‌లో ఉన్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కూడా ఈ ఇండోనేసియా ఓపెన్‌లో శుభారంభం చేశాడు. 50 నిమిషాల్లో జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటో(Kenta Nishimoto) (జపాన్)పై 21-16, 21-14 తేడాతో విజయం సాధించాడు. తన తదుపరి మ్యాచ్‌లో ఎన్ కా లాంగ్ అంగస్ (NG Ka Long Angus ) (హాంకాంగ్)తో తలపడనున్నాడు. అయితే, మహిళల డబుల్స్ ద్వయం ట్రీసా జాలీ, గాయత్రీ గోపీచంద్ తొలిరౌండ్లోనే రిన్ ఇవానాగా (Rin Iwanaga), కీ నకనిషి (Kie Nakanishi) (జపాన్) చేతిలో ఓడిపోయారు.
Malaysia Masters 2023 PV Sindhu : ఇటీవల జరిగిన మలేసియా మాస్టర్స్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన సింధు.. సెమీ ఫైనల్లో ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో విభాగంలో 14-21, 17-21తో ఇండోనేసియాకు చెందిన జార్జియా మరిస్కా టున్ జుంగ్ చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నీ కంటే ముందు జరిగిన స్పెయిన్ టోర్నీలో కూడా సింధు కాస్తలో టైటిల్ మిస్ చేసుకుంది. ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గాయాల నుంచి కోలుకున్న సింధు ఇప్పటి వరకు ఒక్క కప్పు కూడా కొట్టలేదు.