చైనా బీజింగ్‌లో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అభిషేక్‌వర్మ పసిడి కైవసం చేసుకున్నాడు. ఎనిమిది మంది తలపడిన ఫైనల్లో 242.7 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ విజయంతో ఒలింపిక్స్ కోటాలో ఐదో స్థానాన్ని పదిల పరచుకున్నాడు అభిషేక్‌వర్మ. 2020లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను ఇప్పటికే అన్జుమ్, అపూర్వీ చండిలా, సౌరభ్ చౌదరి, దివ్యాంశ్ ఖాయం చేసుకున్నారు.
దిల్లీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో అభిషేక్ విఫలమైనప్పటికీ.. ఈ టోర్నీలో సత్తాచాటాడు. రష్యాకు చెందిన ఆర్టెమ్ 240.4 పాయింట్లతో రజతం సొంతం చేసుకోగా.. కొరియా క్రీడాకారుడు హ్యాన్ 220 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నాడు.