ఒలింపిక్ పతక విజేతలకు దిల్లీలోని హోటల్ అశోకలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్, క్రీడా సహాయక మంత్రి నిశిత్ ప్రామాణిక్, న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు పాల్గొన్నారు.
స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్డాతో పాటు కాంస్య పతక విజేత బజ్రంగ్ పూనియా, రెజ్లర్ రవి దహియా, పురుషుల హాకీ టీమ్, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ను సన్మానించారు.
-
#AzadiKaAmritMahotsav
— Anurag Thakur (@ianuragthakur) August 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
India’s🇮🇳 #Tokyo2020 Olympic Medalists sang the #RashtraGaan.
You too can join this initiative by recording yourself singing our national anthem & uploading it on https://t.co/7zWsOfZuBI! pic.twitter.com/wLw5gpcDSR
">#AzadiKaAmritMahotsav
— Anurag Thakur (@ianuragthakur) August 9, 2021
India’s🇮🇳 #Tokyo2020 Olympic Medalists sang the #RashtraGaan.
You too can join this initiative by recording yourself singing our national anthem & uploading it on https://t.co/7zWsOfZuBI! pic.twitter.com/wLw5gpcDSR#AzadiKaAmritMahotsav
— Anurag Thakur (@ianuragthakur) August 9, 2021
India’s🇮🇳 #Tokyo2020 Olympic Medalists sang the #RashtraGaan.
You too can join this initiative by recording yourself singing our national anthem & uploading it on https://t.co/7zWsOfZuBI! pic.twitter.com/wLw5gpcDSR
"జావెలిన్ త్రో ఫైనల్లో నేను ప్రత్యేకత సాధించానని అర్థమైంది. నా వ్యక్తిగత రికార్డును (88.07 మీ.) అధిగమించాననుకున్నాను. బల్లెం బాగా విసిరాను. పోటీలు ముగిసిన తర్వాత రోజు కూడా ఒళ్లు నొప్పులు బాగా ఉన్నాయి. కానీ, నేను సాధించిన దాంతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఈ పసిడి పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నాను."
-నీరజ్ చోప్డా, జావెలిన్ త్రో ఆటగాడు.
"ప్రత్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు. మన శక్తి మేరకు మనం రాణించాలి. బరిలోకి దిగాక అసలు భయపడకూడదు. ఇవన్నీ చేస్తే బంగారు పతకం మీ సొంతమవుతుంది" అని నీరజ్ రాబోయే తరానికి సూచించాడు.
"జులపాల జుట్టు వల్ల బాగా ఇబ్బంది అయిందని చోప్డా తెలిపాడు. దాని వల్ల చెమట ఎక్కువ వస్తుందని పేర్కొన్నాడు. అందుకే జుట్టును వీలైనంత కట్ చేపించానని" వెల్లడించాడు.
ఇదీ చదవండి: పతక విజేతలకు కోట్లలో నజరానా- ట్యాక్స్ కట్టాలా మరి?