అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఫార్ములా వన్ రేసులో నెగ్గి మరో టైటిల్ సాధించాడు మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్. ఈ విజయంతో మొత్తం ఆరుసార్లు ఫార్ములావన్ ప్రపంచ టైటిల్ సాధించాడీ బ్రిటన్ రేసర్. ఫలితంగా ఇంగ్లీష్ దేశంలో అత్యుత్తమ క్రీడాకారుల జాబితాలో రెండోస్థానం సంపాదించాడు.
అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో నిలవాలంటే మ్యాచ్‌కు ముందు హామిల్టన్‌కు నాలుగు పాయింట్లు అవసరమయ్యాయి. ఈ తాజా గెలుపుతో వాటిని సాధించాడు. ఐదుసార్లు ఛాంపియన్ జుయాన్ మేన్యుయల్ ఫాంగియో(అర్టెంటీనా)ను మూడో ర్యాంకుకు వెనక్కి నెట్టాడు.
" ఇంకా ఎంతో ఎదగాల్సి ఉంది. మీ అభిమానానికి కృతజ్ఞతలు. నేను, నా పార్ట్నర్ మంచి ప్రదర్శన చేశాము. ఫలితం నన్ను బాగా సర్ప్రైజ్ చేసింది"
-- లూయిస్ హామిల్టన్, రేసర్
7సార్లు ఛాంపియన్ మైఖేల్ షుమాకర్(జర్మనీ) మాత్రమే హామిల్టన్ కంటే ముందున్నాడు. గతంలో ఐదుసార్లు(2008, 2014, 2015, 2017, 2018) ఎఫ్1 ఛాంపియన్‌గా నిలిచాడు లూయిస్ హామిల్టన్. వీటిలో వరుసగా మూడుసార్లు ట్రోఫీ గెలవడం విశేషం.
టాప్ రెండూ అదే జట్టుకు...
యూఎస్ గ్రాండ్ ఫ్రిక్స్లో మెర్సిడెస్ తరఫున బరిలోకి దిగిన హామిల్టన్... రెండో స్థానంలో నిలిచాడు. తన జట్టులోని మరో రేసర్ వాల్ట్టెరి(ఫిన్లాండ్) అగ్రస్థానం సంపాదించాడు. మూడో స్థానంలో డచ్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ నిలిచాడు.