ఫ్లాయిడ్ మేవెదర్.. రింగ్‌లోకి అడుగుపెడితే అతనికి తిరుగేలేదు. వరుసగా 50 విజయాలను నమోదు చేసి బాక్సింగ్ ప్రపంచంలో అసాధ్యం అనిపించే రికార్డు నమోదు చేసి 2017లో బాక్సింగ్ నుంచి అధికారికంగా తప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత కూడా పలు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. రిటైరైనా మేవెదర్ పంచ్‌లో పవర్ తగ్గలేదు. ఇప్పుడు అభిమానులు మరోసారి ఆ పంచ్ పవర్‌ను చూసే అవకాశం వచ్చింది. జపాన్ వేదికగా జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మేవెదర్ పాల్గొనున్నట్లు తెలుస్తోంది. జపాన్‌కు చెందిన ఎంఎంఏ ఫైటర్ మికురు అసాకురాతో బౌట్లో తలపడనున్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా నిర్వహకులు ప్రకటించలేదు. సెప్టెంబరులో ఈ బౌట్ జరిగే అవకాశం ఉందని సమాచారం.
ఆ రికార్డ్ బద్దులుకొడతా: 50 వరుస విజయాలను నమోదు చేసి ఎందరో దిగ్గజాలను నాకౌట్ చేసిన మేవెదర్‌ను తాను కచ్చితంగా ఓడిస్తాను అంటున్నాడు ప్రత్యర్థి అసాకురా. మేవెదర్పై విజయం సాధించి ఫైటర్‌గా తన స్థాయిని పెంచుకుంటాను అని ధీమా వ్యక్తం చేశాడు. ఇదివరకు మేవెదర్పై ఆ 50 ఫైటర్లు నమోదు చేయాలని విజయాన్ని తాను నమోదు చేసి చూపిస్తానని చెప్పుకొచ్చాడు. ఎంఎంఏ ఫైటర్‌గా అసాకురా ఖాతాలో 16 విజయాలు ఉండగా.. 3 ఓటములు ఉన్నాయి. అతని కెరీర్లో మొత్తం 8 నాకౌట్లు ఉన్నాయి. జపాన్‌కు చెందిన రిజిన్ ఫైటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఇదీ చూడండి : హెడ్‌కోచ్ రమేశ్ పొవార్‌తో గొడవ.. స్పందించిన మిథాలీ రాజ్