ETV Bharat / sports

వింబుల్డన్ ఛాంపియన్​గా వొండ్రుసోవా.. మహిళల సింగిల్స్​లో చరిత్రాత్మక విజయం.. - marketa vondrousova wimbledon

Marketa Vondrousova Wimbledon : వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి వొండ్రుసోవా విజయం సాధించింది. ప్రత్యర్థి, టునీషియాకు చెందిన జాబెర్‌పై తొలి రెండు సెట్స్‌లోనే 6-4, 6-4 పాయింట్ల తేడాతో గెలుపొంది గ్రాండ్‌స్లామ్‌లో ఖాతా తెరిచింది.

Marketa Vondrousova Wimbledon
Marketa Vondrousova Wimbledon
author img

By

Published : Jul 15, 2023, 8:45 PM IST

Updated : Jul 15, 2023, 10:15 PM IST

Marketa Vondrousova vs Ons Jabeur : వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి వొండ్రుసోవా విజయం సాధించింది. టునీషియాకు చెందిన ప్రత్యర్థి జాబెర్‌పై తొలి రెండు సెట్స్‌లోనే 6-4, 6-4 పాయింట్ల తేడాతో గెలుపొంది తొలి గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడింది. వింబుల్డన్​ చరిత్రలో ఛాంపియన్​గా నిలిచిన తొలి అన్​సీడెడ్​ ప్లేయర్​గా రికార్డు సృష్టించింది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఫైనల్‌ పోరులో ఓటమి చవిచూసిన జాబెర్‌.. తాజా మ్యాచ్‌లోనూ విఫలమైంది.

ఇప్పటికే రెండు సార్లు ఫైనల్‌కు వెళ్లిన జాబెర్‌ భారీ అంచనాలతో రంగంలోకి దిగింది. కానీ, సెంటర్‌ కోర్టులో జరిగిన ఈ ఫైనల్‌ పోరులో తొలిసారి అడుగుపెట్టిన వొండ్రుసోవాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. తొలిసెట్లో ఆరు పాయింట్లను అవలీలగా కొట్టేసిన వొండ్రుసోవా, రెండో సెట్‌లో మాత్రం కొద్దిపాటి పోటీని ఎదుర్కొంది. అయితే, పాయింట్లు రాబట్టడంలో ఏమాత్రం వెనకంజ వేయలేదు. రెండు సెట్లలోనూ జాబెర్‌ 4 పాయింట్లకే పరిమితమైంది. అయితే, ప్రతిష్టాత్మక వింబుల్డన్​లో టోర్నీలో ఓటమిపై జాబెర్​ స్పందించింది. 'ఈ రోజు నాకు చాలా కష్టమైన రోజు. కానీ నేను మరింత బలంగా తిరిగి వస్తాను. ఇది చాలా కఠినమైన ప్రయాణం. కానీ నేను తిరిగి వస్తాను. ఏదో ఒక రోజు ఈ టోర్నమెంట్ గెలుస్తానని వాగ్దానం చేస్తున్నాను" అని జాబెర్​ భాగోద్వేగానికి గురైంది.

ఈ ఏడాది జనవరిలో భారత టెన్నిస్‌ స్టార్ సానియా మీర్జా తన గ్రాండ్‌స్లామ్‌ జర్నీతో ఓటమితో ముగించింది. గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌లో చివరిదైన ఆస్ట్రేలియా ఓపెన్​లో మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో పోటీపడింది. మహిళల డబుల్స్‌ నిరాశపర్చినప్పటికీ.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మరో భారత ఆటగాడు రోహన్‌ బోపన్నతో కలిసి ఫైనల్‌ వరకు దూసుకెళ్లింది. అయితే ఈ టైటిల్‌ పోరులో బ్రెజిల్‌ జంట స్టెఫాని-రఫెల్‌లో చేతిలో 6-7, 2-6 తేడాతో సానియా-బోపన్న జోడీ ఓటమిపాలైంది. ఫలితంగా సానియా.. గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌కు ఓటమితో వీడ్కోలు పలికినట్లయింది. 2009లో మహేష్‌ భూపతితో కలిసి సానియా తన తొలి గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) కైవసం చేసుకోగా.. ఆ తర్వాత మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రెండు, మహిళల డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు సొంతం చేసుకుంది. సానియా మీర్జా తన కెరీర్​లో మొత్తంగా 43 డబుల్స్‌ టైటిళ్లను గెలిచింది.

Last Updated : Jul 15, 2023, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.