ETV Bharat / sports

Tokyo Olympics: ప్రారంభోత్సవానికి అమెరికా ప్రథమ మహిళ - అమెరికా ప్రథమ మహిళ జిల్​ బైడెన్

అమెరికా ప్రథమ మహిళ జిల్​ బైడెన్​ టోక్యో ఒలింపిక్స్​ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. అధ్యక్షుడు బైడెన్​ లేకుండానే ఆమె ఈ మెగా క్రీడలకు వెళ్లనున్నారు.

Jill Biden to attend Tokyo Olympics
అమెరికా ప్రథమ మహిళ జిల్​ బైడెన్​
author img

By

Published : Jul 13, 2021, 7:04 PM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​(Joe Biden) భార్య, ఆ దేశ ప్రథమ మహిళ జిల్​ బైడెన్.. జులై 23న టోక్యో ఒలింపిక్స్​ ప్రారంభ వేడుకకు వెళ్లనున్నారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. తొలిసారి ఆయన లేకుండానే ఆమె​ విదేశీ ప్రయాణం చేస్తున్నారు. చివరిసారిగా 2010లో కెనడాలో జరిగిన వింటర్​ గేమ్స్​కు తన భర్తతో కలిసి వెళ్లారు జిల్​.

గతంలోనూ పలువురు అమెరికా ప్రథమ మహిళలు ఒలింపిక్స్​ను సందర్శించారు. 1994లో హిల్లారి క్లింటన్​ లిల్లెహ్యామర్​ వింటర్​, 1996 అట్లాంట గేమ్స్​ను వీక్షించగా.. 2006టురిన్​ ఒలింపిక్స్​, 2008 సమ్మర్​ ఒలింపిక్స్​లో లారా బుష్​, 2012 సమ్మర్​ ఒలింపిక్స్​లో మిచెల్​ ఒబామా సందడి చేశారు.

కరోనా కారణంగా అత్యయిక స్థితిలోనే ప్రేక్షకులు లేకుండా ఈ సారి ఒలింపిక్స్​ జరగనున్నాయి. ఈ మెగా క్రీడలకు దాదాపుగా 11వేల మంది క్రీడాకారులు రానున్నారు. భారత్ తరఫున 18 విభాగాల్లో మొత్తం 119 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: Tokyo Olympics: భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.