ETV Bharat / sports

ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్​లో ​తస్నిమ్‌ నంబర్‌వన్‌ - Tasnim Mir record

Tasnim Mir Latest News: ప్రపంచ జూనియర్ బాడ్మింటన్​ ర్యాకింగ్స్​లో గుజరాత్​కు చెందిన షట్లర్​ తస్నిమ్​ మీర్ నంబర్​వన్​ స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 16 ఏళ్ల తస్నిమ్‌ రికార్డు సృష్టించింది.

Tasnim Mir
తస్నిమ్‌ మీర్
author img

By

Published : Jan 13, 2022, 6:59 AM IST

Tasnim Mir Latest News: ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో భారత షట్లర్‌ తస్నిమ్‌ మీర్‌ (గుజరాత్‌) నంబర్‌వన్‌గా నిలిచింది. బుధవారం బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించిన అండర్‌-19 బాలికల సింగిల్స్‌ జాబితాలో తస్నిమ్‌ నంబర్‌వన్‌ ర్యాంకు సొంతం చేసుకుంది.

ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 16 ఏళ్ల తస్నిమ్‌ రికార్డు సృష్టించింది. గత ఏడాది బీడబ్ల్యూఎఫ్‌ జూనియర్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్న సామియా ఇమాద్‌ ఫారూఖీ (తెలంగాణ) నంబర్‌వన్‌ ర్యాంకు సాధించలేకపోయింది.

2021లో అండర్‌-19 విభాగంలో టాప్‌-10లో ఉన్న తస్నిమ్‌ అద్వితీయ ప్రదర్శనతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గత కొన్నేళ్లుగా గువాహటిలోని అస్సాం బ్యాడ్మింటన్‌ అకాడమీలో తస్నిమ్‌ శిక్షణ తీసుకుంటోంది.

ఇదీ చూడండి: వాషింగ్టన్ ఔట్.. టీమ్​ఇండియా వన్డే జట్టులోకి ఆ ఇద్దరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.