మహ్మద్ అనాస్, వీకే విస్మయ, జిస్న మాథ్యూ, నిర్మల్ తోమ్లతో కూడిన భారత 4x400 రిలే జట్టు శనివారం జరిగిన క్వాలిఫయర్‌లో సత్తా చాటి ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ ఎనిమిది దేశాలు పాల్గొన్న తుదిపోరులో 3:15.77 నిమిషాల్లో రేసును పూర్తి చేసి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఫైనల్స్‌కు క్వాలిఫై అవడం ద్వారా ఇప్పటికే ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకుంది భారత మిక్స్డ్ రిలే జట్టు.
ఇంతకుముందు ఆసియాన్ గేమ్స్‌లో ఇదే జట్టు 3:15:71 నిమిషాల్లో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
ఈ టోర్నీలో మిక్స్డ్ రిలేను తొలిసారిగా ప్రవేశపెట్టగా.. పోటీల్లో అమెరికా జట్టు స్వర్ణం ఎగరేసుకుపోయింది. 3:09:34 నిమిషాల్లో రేసును పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచింది. జమైకా (3:11:78) రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ఇవీ చూడండి.. మ్యాచ్ తర్వాత బంతిని ఏం చేస్తారో తెలుసా..?