ETV Bharat / sports

ఆ క్రీడాకారుల కోసం హరియాణా నిధుల కేటాయింపు - Olympic qualifiers Haryana Government

ఒలింపిక్స్​కు అర్హత సాధించిన తమ రాష్ట్ర అథ్లెట్స్​కు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఒక్కో ఆటగాడికి రూ.5లక్షల చొప్పున నిధులను కేటాయించింది హరియాణా ప్రభుత్వం.

olympics
ఒలింపిక్స్​
author img

By

Published : Feb 11, 2021, 11:56 AM IST

Updated : Feb 11, 2021, 12:07 PM IST

ఒలింపిక్స్​కు అర్హత సాధించిన తమ రాష్ట్ర అథ్లెట్స్​కు అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది హరియాణా ప్రభుత్వం​. ఆర్థికంగా వెనుకబడిన ఆటగాళ్లకు ప్రోత్సాహించేందుకు ఒక్కో ఆటగాడికి రూ.5లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతోపాటు హరియాణా ఔట్​స్టాండింగ్​ స్పోర్ట్​పర్సన్​(రిక్రూమెంట్​ అండ్​ కండీషన్స్​ ఆఫ్ సర్వీస్​) రూల్స్​-2018 స్థానంలో హరియాణా ఔట్​స్టాండింగ్​ స్పోర్ట్​పర్సన్​(గ్రూప్​ ఏ,బీ,సీ) రూల్స్-2021ను తీసుకొచ్చే విధంగా క్యాబినెట్​ ఆమోదించింది. దీని ద్వారా రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సాహించేలా ప్రత్యేక క్యాడర్​ను ఏర్పాటు చేసేందుకు దోహదపడుతుంది. గ్రూప్​-ఏలో డిప్యూటీ డైరెక్టర్లు(50), గ్రూప్​-బీలో సీనియర్​ కోచ్​(100), గ్రూప్​-సీలో జూనియర్​ కోచ్​(250)పోస్టులు కేటాయించింది. ఈ పోస్టులకు ఆటగాళ్లు దరఖాస్తు చేసుకొనేందుకు వయసు పరిమితిని 50 నుంచి 42ఏళ్లకు తగ్గించింది.

ఇదీ చూడండి: స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌కు డీఎస్పీ కొలువు

Last Updated : Feb 11, 2021, 12:07 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.