ETV Bharat / sports

ర్యాంకింగ్​ రౌండ్: దీపిక 9వ స్థానం, మెన్స్​, మిక్స్​డ్​ టీం@9 - ఆర్చరీ ఒలింపిక్ రికార్డు

ఒలింపిక్స్​లో భారత అథ్లెట్ల ఆట షురూ అయింది. తొలిరోజు ఆర్చరీ వ్యక్తిగత ర్యాంకింగ్​ రౌండ్​ పోటీలు జరిగాయి. మహిళల విభాగంలో.. మన ఆర్చర్, వరల్డ్​ నెం.1 దీపికా కుమారి మెరుగైన ప్రదర్శన చేసింది. టాప్-2లో కొరియన్ అథ్లెట్లు నిలిచారు. పురుషుల విభాగంలో తొలిసారి ఒలింపిక్స్​ బరిలో నిలిచిన ప్రవీణ్ జాదవ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మెన్స్​ టీం, మిక్స్​డ్​ విభాగాల్లోనూ భారత్​కు 9వ ర్యాంకు లభించింది.

.
.
author img

By

Published : Jul 23, 2021, 8:23 AM IST

Updated : Jul 23, 2021, 1:22 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​ వేట మొదలైంది. ఆర్చరీ మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్​ రౌండ్​లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది వరల్డ్​ నెంబర్​ వన్​ దీపికా కుమారి. మొత్తం 64 మందిలో 9వ స్థానంలో నిలిచింది. 72 బాణాలు సంధించి, 663 స్కోరు సాధించింది. ఈ విషయాన్ని భారత క్రీడా సమాఖ్య(SAI) ట్వీట్ చేసింది.

deepika kumari
దీపికా కుమారి

ఒలింపిక్ రికార్డు

క్వాలిఫికేషన్ రౌండ్​లో అద్భుత ప్రదర్శన చేసిన దక్షిణాకొరియా ఆర్చర్ అన్ సన్.. అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా 680 పాయింట్లు దక్కించుకుని, ఒలింపిక్ రికార్డు సృష్టించింది.

olympics archery ranking round
ర్యాంకింగ్స్ రౌండ్ జాబితా
An San
దక్షిణాకొరియా ఆర్చర్ అన్ సున్

అంతకుముందు ర్యాంకింగ్​ రౌండ్​లో 673 స్కోరుతో రికార్డు ఉండగా, ప్రపంచ రికార్డు కాంగ్ చే వాంగ్(692)పేరిట ఉంది.

దీపిక.. భూటాన్​ ఆర్చర్​తో..

టేబుల్​ టాప్​లో ఉన్న ఆర్చర్లు.. దిగువ స్థానాల్లో నిలిచిన వారితో తలపడాల్సి ఉంటుంది. అంటే తొలి స్థానంలో నిలిచిన అన్​ సన్​, ర్యాంకింగ్​ రౌండ్​లో చివరి స్థానంలో(64) ఉన్న ఆర్చర్​తో తదుపరి రౌండ్​ ఆడాలి.

దీపికా కుమారి(9).. భూటాన్​కు చెందిన కర్మాతో తొలి రౌండ్​ ఆడనుంది. కర్మా ర్యాంకింగ్​ రౌండ్​లో 56వ స్థానంలో నిలిచింది.

దీపికకు.. అన్​ సన్ క్వార్టర్​ ఫైనల్లో ఎదురుపడాల్సి రావచ్చు.

జులై 27- 31 తేదీల మధ్య ఎలిమినేషన్​ రౌండ్స్​ జరగనున్నాయి. జులై 30న ఉమెన్స్​ నాకౌట్​ మ్యాచ్​లు, 31న మెన్స్​ నాకౌట్​ మ్యాచ్​లు జరగనున్నాయి.

రేపటి నుంచి మెడల్స్​..

జులై 24- మిక్స్​డ్​ టీం ఈవెంట్​

జులై 25- మహిళల టీం ఈవెంట్​

జులై 26- పురుషుల టీం ఈవెంట్​

పురుష ఆర్చర్లు అంతంత మాత్రమే

తొలిసారి ఒలింపిక్స్​లో పాల్గొన్న ఆర్చర్ ప్రవీణ్ జాదవ్.. తొలిరోజు పోటీల్లో మెప్పించాడు. సీనియర్ ఆర్చర్లు అతాను దాస్, తరుణ్​దీప్​ కంటే ఎక్కువ స్కోరు చేశాడు. దీంతో పురుషుల ఆర్చరీ జట్టు 9వ స్థానంలో నిలిచింది. మిక్స్​డ్ జట్టు(దీపికా కుమారి, జాదవ్​ ప్రవీణ్​​) విభాగంలోనూ తొమ్మిదో స్థానంలో నిలిచింది.

PRAVEEN
ప్రవీణ్​

పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్​ రౌండ్​లో.. భారత పురుష ఆర్చర్లు ఒక్కరు కూడా టాప్-30లో చోటు దక్కించుకోలేకపోయారు. జాదవ్ 31వ స్థానంలో, అతాన్ దాస్ 35, తరుణ్​ 37వ స్థానంలో నిలిచారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 23, 2021, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.