ETV Bharat / sports

104 ఏళ్ల బామ్మకు నారీశక్తి పురస్కారం

వయసేమో 104.. కానీ యువతులతో పాటు షూ లేస్‌ కట్టి ట్రాక్‌లో అడుగుపెట్టింది. వందేళ్ల వయసులో రేసుల్లో పోటీపడుతూ ఔరా అనిపిస్తోంది. తన క్రీడా స్ఫూర్తితో అందర్ని ఆకట్టుకున్న ఆ బామ్మ పేరు మన్‌కౌర్‌. వందేళ్లు దాటినా తనలో ఉత్సాహం తగ్గలేదని నిరూపిస్తూ పరుగులు పెడుతోంది ఈ పంజాబీ బామ్మ. తాజాగా ఆమెకు నారీశక్తి పురస్కారం ప్రకటించింది భారత ప్రభుత్వం.

Centenarian sprinter Man Kaur to get Nari Shakti Puraskar on March 8
104 ఏళ్ల బామ్మకు నారీశక్తి పురస్కారం
author img

By

Published : Mar 7, 2020, 6:42 PM IST

గతేడాది న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో మన్‌కౌర్‌ అడుగుపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె వయసు 100 ఏళ్లు పైన ఉండడమే. నడవడమే అత్యంత కష్టమైన వయసులో పరుగెత్తడం అంటే మాటలా..!! కానీ మన్‌కౌర్‌ చాలా సులభంగా పరుగు తీసి అందర్ని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు 100మీ పరుగులో తన వయసు కేటగిరిలో ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. వందేళ్లు దాటిన వాళ్లు పరుగెత్తే 100మీ రేసు కేటగిరిలో మన్‌కౌర్‌ రెండేళ్ల నుంచి ఉత్సాహంగా బరిలో దిగుతోంది. 'చండీగఢ్‌ అద్భుతం' అంటూ విదేశీ పత్రికలు ఆమె ఘనతల గురించి కథనాలు ప్రచురించాయి.

2019 ఏడాదిలో మహిళా సాధికారత కృషికి గానూ మన్​కౌర్​కు మార్చి 8న ప్రతిష్టాత్మక నారి శక్తి పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చేతులమీదుగా ఈ అవార్డును అందుకోనుందని ఆమె కుమారుడు తెలిపాడు. ఈ గౌరవం తన అమ్మకు దక్కటం చాలా ఆనందంగా ఉందని వెల్లడించాడు.

94 ఏళ్ల వయసులో..

మన్‌కౌర్‌ మొదటి నుంచి అథ్లెట్‌ కాదు. 90 ఏళ్లు దాటిన తర్వాతే ఆమె పరుగు మొదలుపెట్టింది. 82 ఏళ్ల కొడుకు గుర్‌దేవ్‌సింగ్‌ అథ్లెట్‌ కావడం ఆమెకు కలిసొచ్చింది. అమ్మకు గుండె సమస్యలు, మోకాలి నొప్పులు ఏమీ లేకపోవడం వల్ల ఆమె మరింత ఆరోగ్యంగా ఉండడం కోసం ట్రాక్‌లోకి తీసుకొచ్చాడు. కానీ పరుగంటే మక్కువ చూపిన ఆమె.. పోటీల్లోనూ పాల్గొనడం ప్రారంభించింది. ఇప్పటిదాకా కౌర్‌ 20 అంతర్జాతీయ పతకాలు గెలుచుకుంది.

Centenarian sprinter Man Kaur to get Nari Shakti Puraskar on March 8
మన్​కౌర్, గురుదేవ్​ సింగ్​

"ప్రతిరోజూ బాగా తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అనారోగ్యకరమైన పదార్థాల జోలికి వెళ్లొద్దు. అందరితో స్నేహంగా ఉండాలి. ఈ అలవాట్లే మంచి ఆరోగ్యాన్నిస్తాయి. ఓపిక ఉన్నంత వరకు పరుగెత్తుతూనే ఉంటా"

- మన్‌కౌర్‌

జావెలిన్‌, షాట్‌పుట్‌, స్కైవాక్‌

100మీ పరుగులోనే కాదు జావెలిన్‌ త్రో, షాట్‌పుట్‌లోనూ ఈ బామ్మకు ప్రవేశం ఉంది. ఆక్లాండ్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఆమె జావెలిన్‌ను 5 మీటర్ల 12 సెంటీమీటర్లు విసిరి 100 ఏళ్ల వయసులో ఎక్కువ దూరం జావెలిన్‌ను విసిరిన క్రీడాకారిణిగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఇదే క్రీడల్లో ఆమె షాట్‌పుట్‌, 200మీ పరుగులోనూ స్వర్ణాలు గెలిచింది. అంతేకాదు ఈ బామ్మ ఆక్లాండ్‌ నగరంలో తన కుమారుడితో కలిసి స్కైవాక్‌ చేసి అందర్ని ఆశ్చర్యపరిచింది.

కొడుకుతో పాటు పరుగు

పంజాబ్‌లోని పాటియాలా యూనివర్సిటీలో తల్లి కొడుకులిద్దరూ రోజూ ప్రాక్టీస్‌ చేసేవారు. శాఖాహారం మాత్రమే తీసుకునే కౌర్‌.. రోజులో రెండుసార్లు చిక్కని పాలు, సోయా మిల్క్‌తో పాటు నవధాన్యాలతో చేసిన రోటీలు తీసుకుంటుంది. ప్రతిరోజూ జిమ్‌కు వెళ్తుంది. అంతేకాదు జావెలిన్‌, షాట్‌పుట్‌ సాధన చేస్తుంది. 2010లో తొలిసారి చండీగఢ్‌ మాస్టర్స్‌లో స్వర్ణం గెలిచిన కౌర్‌.. అక్కడ నుంచి పతకాలు సాధిస్తూనే ఉంది. అమ్మ ఇస్తున్న స్ఫూర్తితో కౌర్‌ కొడుకు గుర్‌దేవ్‌ 82 ఏళ్ల వయసులోనూ పతకాలు సాధిస్తున్నాడు. ఆక్లాండ్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌లో పురుషుల 100మీ పరుగులో గుర్‌దేవ్‌ స్వర్ణం గెలిస్తే.. మహిళల్లో అతడి అమ్మ పసిడి సాధించింది.

ఇదీ చూడండి.. ఆసియాకప్​: తటస్థ వేదికకు పాక్ గ్రీన్ సిగ్నల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.