Canada Open Badminton 2023 Final : కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో లక్ష్యసేన్ గెలుపొందాడు. ఫైనల్లో తన ప్రత్యర్థి.. ప్రపంచ పదో ర్యాంకర్ చైనా ఆటగాడు షై ఫెంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సెట్లలో 21-18, 22-20 తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2022 టోర్నీలో విజయం సాధించిన తర్వాత లక్ష్యసేన్.. బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండోసారి.
- రౌండ్ 32లో థాయ్‌లాండ్ ప్లేయర్ ప్రపంచ నాలుగో ర్యాంకర్ కున్లావుత్ పై 21-18, 21-15 తేడాతో గెలిచాడు.
- రౌండ్ 16లో బ్రెజిల్ ప్లేయర్ ఒలివిరాతో పోరాడిన లక్ష్యసేన్.. 21-15, 21-11తో చిత్తుచేసి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు.
- జర్మన్ ఆటగాడు కరాగితో క్వార్టర్స్‌లో తలపడ్డాడు లక్ష్యసేన్. ఈ మ్యాచ్‌తో కెనడా ఓపెన్ 500లో లక్ష్యసేన్ మొదటిసారి మూడో సెట్ ఆడాల్సి వచ్చింది. ఫస్ట్ సెట్లో లక్ష్య.. తన ప్రత్యర్థి కరాగిపై 21-8 భారీ ఆధిక్యం సాధించాడు. కానీ రెండో సెట్లో జర్మన్ ప్లేయర్ 21-17తో లక్ష్యసేన్‌కు గట్టిపోటీ ఇచ్చాడు. దీంతో ఆట మూడో సెట్‌కు దారితీసింది. ఇక మూడో సెట్లో పుంజుకున్న లక్ష్య.. మళ్లీ ఆధిక్యంలోకి దూసుకొచ్చి 21-10 తో క్వార్టర్స్‌లో కరాగిపై విజయం సాధించాడు.
- సెమీఫైనల్లో జపాన్ ఆటగాడు కెంటా నిషిమొటొను 21-17, 21-14తో నాలుగో సీడ్‌లో లక్ష్య చిత్తుచేశాడు. ప్రపంచ 11వ ర్యాంకర్ నిషిమొటొను లక్ష్య 44 నిమిషాల్లో మట్టికరిపించాడు. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డట్లు కనిపించిన లక్ష్య.. కొద్దిసేపటికే మళ్లీ ఫామ్‌లోకి వచ్చి గెలుపొంది ఫైనల్స్‌లోకి దూసుకెళ్లాడు.
కాగా గతేడాది ఆగస్ట్‌లో ప్రపంచ ఛాంపియన్షిప్స్ తర్వాత లక్ష్యసేన్ ముక్కుకు సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ నుంచి లక్ష్య కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అతడు చివరిసారిగా 2022లో బర్మింగమ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్నాడు.
మరోవైపు ఉమెన్స్ సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు సెమీస్‌లో ఓడింది. సెమీస్‌లో నాలుగో సీడ్ సింధు జపాన్ ప్లేయర్, ప్రపంచ నంబర్‌వన్ అకానె యమగూచితో..14-21, 15-21తో పరాజయం చవిచూసింది. 43 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించిన యమగూచి.. తన గెలుపోటముల రికార్డులో సింధు ఆధిక్యాన్ని 11-14కు తగ్గించింది.
-
🏆🇮🇳 CHAMPION! Lakshya Sen defeated the 5th seed LI Shi Feng of China to lift the Canada Open 2023 Championship.
— The Bharat Army (@thebharatarmy) July 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🎉 Congratulations, Lakshya!
📷 Pic belongs to the respective owners • #LakshyaSen #CanadaOpen2023 #IndiaontheRise #Badminton #TeamIndia #BharatArmy pic.twitter.com/Ra0rH4jBww
">🏆🇮🇳 CHAMPION! Lakshya Sen defeated the 5th seed LI Shi Feng of China to lift the Canada Open 2023 Championship.
— The Bharat Army (@thebharatarmy) July 10, 2023
🎉 Congratulations, Lakshya!
📷 Pic belongs to the respective owners • #LakshyaSen #CanadaOpen2023 #IndiaontheRise #Badminton #TeamIndia #BharatArmy pic.twitter.com/Ra0rH4jBww🏆🇮🇳 CHAMPION! Lakshya Sen defeated the 5th seed LI Shi Feng of China to lift the Canada Open 2023 Championship.
— The Bharat Army (@thebharatarmy) July 10, 2023
🎉 Congratulations, Lakshya!
📷 Pic belongs to the respective owners • #LakshyaSen #CanadaOpen2023 #IndiaontheRise #Badminton #TeamIndia #BharatArmy pic.twitter.com/Ra0rH4jBww