ETV Bharat / sports

Asian Games 2023 India Medals : భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు.. రజతం, కాంస్య పతకాలు కూడా - india total medals in asian games 2023

Asian Games 2023 India Medals : 2023 ఆసియా గేమ్స్​లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. తాజాగా మరో రెండు గోల్డ్ మెడల్స్ భారత్ ఖాతాలో పడ్డాయి.

Asian Games 2023 India Medals
Asian Games 2023 India Medals
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 6:43 PM IST

Updated : Oct 3, 2023, 11:02 PM IST

Asian Games 2023 India Medals : 2023 ఆసియా గేమ్స్​లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. 5000 మీటర్ల మహిళల రేస్​లో భారత అథ్లెట్ పారుల్ చౌదరి స్వర్ణ పతకం దక్కించుకుంది. ఈ పోటీలో పారుల్.. తన లక్ష్యాన్ని15 నిమిషాల 14.75 సెకన్లలో చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఇక సోమవారం కూడా పోటీల్లో పాల్గొన్నపారుల్.. 3000 మీటర్ల స్టీపుల్‌ ఛేజ్‌లో సిల్వర్​ మెడల్ నెగ్గింది. మరోవైపు అన్నూ రాణి జావెలిన్ త్రోలో పసిడిని ముద్దాడింది. అన్నూ.. 62.92 మీటర్ల దూరం వరకు బల్లెం విసిరి ఫైనల్స్​లో విజేతగా నిలిచింది. జావెలిన్​ త్రో గేమ్​లో భారత్​కు ఇదే తొలి స్వర్ణ పతకం. ఇక మంగళవారం ఒక్కో రోజే భారత్​కు రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు 15 స్వర్ణాలు సహా పతకాల సంఖ్య 69కు చేరింది. ఇందులో 15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు ఉన్నాయి.

మంగళవారం ఆయా విభాగాల్లో భారత అథ్లెట్లు గెలిచిన పతకాలు..

  • పురుషుల 800 మీటర్ల పరుగులో మహ్మద్‌ అఫ్సల్‌.. రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు.
  • డెకథ్లాన్ విభాగంలో భారత అథ్లెట్​ తేజస్విన్ శంకర్ సిల్వర్ మెడల్​ గెలుచుకున్నాడు.
  • ట్రిపుల్‌ జంప్‌ పురుషుల విభాగంలో ప్రవీణ్ చిత్రవేల్.. కాంస్య పతకాన్ని నెగ్గాడు.
  • మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో.. విత్యా రామరాజ్ కాంస్యాన్ని సాధించింది.
  • బాక్సింగ్‌ 54 కేజీల మహిళల విభాగంలో.. భారత బాక్సర్‌ ప్రీతీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
  • 1000 మీటర్ల కనోయింగ్‌ మెన్స్‌ డబుల్స్‌లో భారత ద్వయం అర్జున్ సింగ్, సునీల్ సింగ్ మూడోస్థానలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.
  • పురుషుల విభాగం బాక్సింగ్ పోటీల్లో నరేందర్ కాంస్యం సొంతం చేసుకున్నాడు.
    • Hangzhou Asian Games: India's Parul Chaudhary wins gold medal in Women's 5000-metre race

      Photo source: Athletics Federation of India (AFI) pic.twitter.com/oxyHWYM2qN

      — ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
    • Vithya Ramraj opens the #Athletics medal haul of the day with a beautiful🥉

      Keeping up with a great pace on track, Vithya clocked a time of 55.68 to mark this feat in Women's 400m Hurdles Final💪🏻

      Well done champ👏👏 Heartiest congratulations on the🥉🥳#AsianGames2022pic.twitter.com/UlIhM9arJF

      — SAI Media (@Media_SAI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ పోటీల్లో ఆతిథ్య చైనా.. 297 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇందులో 161 స్వర్ణాలుండగా.. 90 రజతాలు, 46 కాంస్యాలు ఉన్నాయి. తర్వాత 130 మెడల్స్​లో జపాన్ రెండో స్థానంలో ఉంది. జపాన్ (33 గోల్డ్), రిపబ్లిక్ ఆఫ్ కొరియా (32 గోల్డ్) తర్వాత ఈ లిస్ట్​లో భారత్ (15 గోల్డ్) నాలుగో ప్లేస్​లో కొనసాగుతోంది.

Nandini Agasara won Bronze Medal : ఆసియా క్రీడల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థిని.. కాంస్యపతకం కైవసం

Asian Games 2023 India Gold Medal : భారత్​ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు.. భారత 'బాహుబలి' అదరగొట్టేశాడు భయ్యా

Last Updated : Oct 3, 2023, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.