ETV Bharat / sports

Asian Champions Trophy : జపాన్​పై భారత్ ఘన విజయం.. ఫైనల్​లో మలేసియాతో 'ఢీ' - Ind Vs japan Hockey 2023

Asian Champions Trophy : ఆసియా ఛాంపియన్స్​షిప్​ 2023 హాకీ సెమీఫైనల్స్​లో భారత్ విజయం సాధించింది. సెమీస్​లో​ జపాన్​తో తలపడ్డ భారత్ 5 -0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది.

Asian Champions Trophy
సెమీస్​లో భారత్ ఘన విజయం
author img

By

Published : Aug 11, 2023, 10:29 PM IST

Updated : Aug 11, 2023, 10:55 PM IST

Asian Champions Trophy : ఆసియా ఛాంపియన్స్​షిప్​ 2023 హాకీ సెమీఫైనల్స్​లో భారత్ విజయం సాధించింది. శుక్రవారం నాటి రెండో సెమీల్​లో జపాన్​తో తలపడ్డ భారత్ 5 -0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. కాగా ఈ విజయంలో హర్మన్ సేన ఫైనల్స్​లోకి దూసుకెళ్లింది. ఇక తుదిపోరులో భారత్ మలేసియాను ఢీ కొట్టనుంది.

  • The Men in Blue are here to stay🥳

    Team 🇮🇳 wins 5️⃣-0️⃣against 🇯🇵 & march into the Final in style at the Men's Asian Champions Trophy

    Congratulations team 🇮🇳!!

    Go get the 🏆💪🏻 pic.twitter.com/1UU4xIt4fi

    — SAI Media (@Media_SAI) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చెన్నైలోని రాధాకృష్ణ స్టేడియంలో జరిగిన సెమీస్​లో భారత్ మొదటి నుంచి ధీటుగానే ప్రత్యర్థిని ఎదుర్కొంది. కాగా పెనాల్టీ రూపంలో భారత్​కు తొలి స్కోరింగ్ పాయింట్ వచ్చింది. 19వ నిమిషం వద్ద ఆకాశ్​దీప్ గోల్​ ద్వారా భారత్ ముందంజ వేసింది. తర్వాత జోరును కొనసాగిస్తూ.. 23వ నిమిషం వద్ద రెండో పెనాల్టీ కార్నర్​లో భారత కెప్టెన్ హర్మన్.. జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. సగం ఆట ముగిసేసరికి భారత్ మూడు రెట్ల ఆధిక్యంలో నిలిచింది. తర్వాత కూడా భారత ఆటగాళ్లు అదే జోరు కొనసాగించారు. చివర్లో భారత యంగ్ ప్లేయర్ కార్తి సెల్వం.. 51వ నిమిషం వద్ద గోల్ సాధించడం వల్ల భారత్ ఆటను 5 - 0తో ముగించి జయకేతనం ఎగురవేసింది.

Asian Champion Trophy Final : శనివారం ఫైనల్స్​లో భారత్.. మలేసియాతో తలపడనుంది. మరోవైపు సెమీస్​లో ఓడిన జపాన్, డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్​ కొరియా మధ్య మూడు, నాలుగు స్థానాల కోసం మ్యాచ్ జరగనుంది. కాగా భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేసియా, జపాన్, పాకిస్థాన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆరు దేశాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఈ పోటీల్లో ఐదింట్లో నాలుగు గెలిచి లీగ్ స్థాయిలో భారత్ టాప్ ప్లేస్​లో నిలిచింది. మరో మ్యాచ్​ను డ్రాగా ముగించింది భారత్.

  • #WATCH | Chennai, Tamil Nadu: On winning the semi-finals of the Asian Champions Trophy, Indian Hockey player Jugraj Singh; says, “We are very happy as today's match was very crucial for us. Winning for us today was important & we won...This tournament is preparation for the Asian… pic.twitter.com/LJn5g5W0gS

    — ANI (@ANI) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Ind Vs Pak Hockey 2023 : ఈ మ్యాచ్​కు ముందు భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో తలపడింది. ఈ మ్యాచ్​లో 4 - 0 తేడాతో దాయాదిని చిత్తుగా ఓడించింది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్‌.. చివరి వరకు దూసుకెళ్లింది. భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌ (15వ, 23వ) కొట్టగా.. మరో ప్లేయర్​ జుగ్‌రాజ్‌ సింగ్‌ (36వ), ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (55వ) చెరో గోల్​ను సాధించారు. అయితే మూడు గోల్స్‌ పెనాల్టీ కార్నర్ల ద్వారా వచ్చాయి. ఇక ఆకాశ్‌దీప్‌ ఫీల్డ్‌ గోల్‌ సాధించాడు.

Ind Vs Pak Hockey 2023 : ఆసియా ఛాంపియన్స్​ ట్రోఫీ.. పాక్​పై భారత్​ ఘన విజయం..

నాలుగోసారి ఆసియాకప్ ఛాంపియన్​గా భారత్.. ఫైనల్​లో పాక్ చిత్తు

Last Updated : Aug 11, 2023, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.