Argentina Football Bomb: అర్జెంటీనాలో ఫుట్‌బాల్ అభిమానులు బీభత్సం సృష్టించారు. మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులు ఫీల్డ్‌లోకి బాంబులు విసిరి మైదానాన్ని ధ్వంసం చేశారు. దీంతో నెవెల్స్ ఓల్డ్ బాయ్స్, రోసరియో సెంట్రల్ జట్ల ఆదివారం జరగాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆలస్యమైంది. ఈ మేరకు నెవెల్స్ క్లబ్ ట్వీట్ చేసింది.
-
The moment a grenade was thrown onto the pitch prior to the Clásico Rosarino. #Newells pic.twitter.com/hFwckz6cq6
— Newell's Old Boys - English (@Newells_en) March 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The moment a grenade was thrown onto the pitch prior to the Clásico Rosarino. #Newells pic.twitter.com/hFwckz6cq6
— Newell's Old Boys - English (@Newells_en) March 20, 2022The moment a grenade was thrown onto the pitch prior to the Clásico Rosarino. #Newells pic.twitter.com/hFwckz6cq6
— Newell's Old Boys - English (@Newells_en) March 20, 2022
చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆట కొంత ఆలస్యంగా మొదలైనా.. 2016 తర్వాత మొదటిసారిగా న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్ విజయం సాధించింది. "మాకు ఆడే సత్తా ఉంది. మీ దగ్గర గ్రెనేడ్లు ఉన్నాయి. అంతే తేడా.. గెలుపు మాత్రం మాదే" అని నెవెల్స్ ఓల్డ్ బాయ్స్ గెలిచిన తర్వాత ట్వీట్ చేసింది.
బాంబు పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దక్షిణ అమెరికాలోని ఫుట్‌బాల్ అభిమానులు.. ఇదివరకు చాలా సార్లు మ్యాచులు జరుగుతున్న సమయాల్లో అల్లర్లు సృష్టించడం గమనార్హం.
మెస్సీ అరంగ్రేటం చేసింది ఈ జట్టుతోనే..
ఫుట్‌బాల్ లెజెండ్, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ తన ఆటను నెవెల్స్ ఓల్డ్ బాయ్స్ జట్టుతోనే ప్రారంభించాడు. ఆ తర్వాత 13 ఏళ్ల వయసులో బార్సిలోనా జట్టులో చేరాడు. బార్సిలోనా క్లబ్ మొత్తంగా 35 టైటిల్స్ దక్కించుకోవడంలో మెస్సీ ప్రధాన పాత్ర పోషించాడు. ఇతడు జట్టులో కొనసాగిన సమయంలో ఛాంపియన్స్ లీగ్ 4, స్పానిష్ లీగ్ 10, కోపా కప్ 7, స్పానిష్ సూపర్ కప్ 8సార్లు గెలిచింది. ఈ క్లబ్లో ఉన్నప్పుడు మెస్సీ ఆరుసార్లు గోల్డెన్ బాల్ అందుకోవడం సహా ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్‌గానూ నిలిచాడు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి బార్సిలోనా తరఫున అదరగొట్టిన మెస్సీ.. 2021లో క్లబ్‌తో బంధానికి ముగింపు పలికాడు
ఇదీ చదవండి: ఐపీఎల్లో 'సూ..పర్' మచ్చి.. మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌లివే