ETV Bharat / sports

ఆర్చరీ ప్రపంచకప్​: స్వర్ణాలతో మెరిసిన దాస్, దీపిక - archery world cup 2021

ఆర్చరీ ప్రపంచకప్​లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. రికర్వ్​ వ్యక్తిగత పురుషుల, మహిళల విభాగాలలో అతాను దాస్​, దీపికా కుమారి గోల్డ్​ మెడల్స్​ తమ ఖాతాలో వేసుకున్నారు.

Archery World Cup, Indian archers Atanu Das and Deepika Kumari win gold
ఆర్చరీ ప్రపంచకప్​, దీపికా కుమారి, అతాను దాస్
author img

By

Published : Apr 26, 2021, 3:43 PM IST

గ్వాటెమాలా వేదికగా జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్​లో భారత ఆర్చర్లు సత్తా చాటారు. రికర్వ్​ వ్యక్తిగత పురుషుల, మహిళల విభాగాలలో.. అతాను దాస్, దీపికా కుమారి స్వర్ణాలు గెలుచుకున్నారు.

ప్రస్తుత గోల్డ్​ మెడల్​తో దీపికా తన బంగారు పతకాల సంఖ్యను మూడుకు పెంచుకుంది. కాగా, దాస్​కిది తొలి అంతర్జాతీయ స్వర్ణం. స్పెయిన్ ఆర్చర్​ డానియల్​ కాస్ట్రోపై విజయం సాధించి ఈ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇదీ చదవండి: ఆ మార్క్ అందుకున్న నాలుగో క్రికెటర్​ బెయిర్​ స్టో

'ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నా కల సాకారమైనట్లు అనిపిస్తుంది. గత కొన్నేళ్ల నుంచి నేను చాలా కష్టపడ్డాను. దానికి ప్రతిఫలం ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ ఏడాది జరగనున్న ఒలింపిక్స్​కు ముందు ఇది నాకు అనుకూలమైన అంశం. నేను సరైన మార్గంలోనే పనిచేస్తున్నాను.' అని అతాను దాస్​ వెల్లడించాడు.

ఇదీ చదవండి: ప్రపంచకప్‌ ఆర్చరీలో భారత మహిళలకు స్వర్ణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.