ETV Bharat / sports

ప్రపంచ క్రీడా విధానాన్నే మార్చేసిన '2020' - 2020 marks a special chapter in the history of world sports.

కరోనా వల్ల ఈ ఏడాది క్రీడాలోకం తొలుత మూగబోయిన అనంతరం ఎన్నో జాగ్రత్తల నడుమ అభిమానులను అలరించింది. ఏదేమైనప్పటికీ ఈ మహమ్మారి ఆటలపై చూపిన ప్రభావం, తెచ్చిన మార్పు.. ప్రపంచక్రీడా చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది. మొత్తంగా ఈ ఏడాది పలు రికార్డులతో, విషాదాలతో క్రీడాలోకం ప్రయాణం సాగింది. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం.

round
2020 రౌండప్​
author img

By

Published : Dec 31, 2020, 7:33 AM IST

Updated : Dec 31, 2020, 9:26 AM IST

ఈ ఏడాది ప్రపంచ యుద్ధమేమీ జరగలేదు. కానీ ఒలింపిక్స్‌ వాయిదా పడ్డాయి. ఎప్పుడూ వేసవిలో జరిగే ఐపీఎల్‌.. ఈసారి చలి కాలంలో జరిగింది. ఏడాదిలో రెండో గ్రాండ్‌స్లామ్‌గా ఉండే ఫ్రెంచ్‌ ఓపెన్‌.. చివరికి వెళ్లిపోయింది. ఎన్నో టోర్నీలు వాయిదా పడ్డాయి. మరెన్నో రద్దయ్యాయి. అభిమానుల కేరింతలతో హోరెత్తిపోయే మ్యాచ్‌లు.. ఖాళీ స్టేడియాల్లో నిశ్శబ్దం మధ్య జరిగాయి. ఇలా కరోనా మహమ్మారి ఆటలపై చూపించిన ప్రభావం, తెచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. ఆటలు ఆడే.. నిర్వహించే.. చూసే విధానాలనే మార్చేసిన 2020 ప్రపంచ క్రీడా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది.

గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ వినోదాల్లో మునిగి తేలారు క్రికెట్‌ ప్రేమికులు. ఈ ఏడాది పొట్టి కప్పు సందడి కోసం ఉత్కంఠతో ఎదురు చూశారు. ఫుట్‌బాల్‌ ప్రియులేమో యూరో కప్‌ మీద ఎన్నో ఆశలతో ఉన్నారు. టెన్నిస్‌ ప్రియులేమో ఎప్పట్లాగే గ్రాండ్‌స్లామ్స్‌ వినోదం కోసం సిద్ధమై ఉన్నారు. ఇంకా వివిధ క్రీడల్లో ప్రణాళికల్లో ఉన్న లీగ్‌లు, టోర్నీలు ఎన్నెన్నో! ఇక క్రీడాభిమానులందరి ఫేవరెట్‌, ప్రపంచంలోనే అతి పెద్ద స్పోర్ట్స్‌ ఈవెంట్‌ అయిన ఒలింపిక్స్‌ మీద అంచనాల గురించి చెప్పేదేముంది? ఆయా టోర్నీల మీద అంచనాలను పెంచేలాగే కొత్త ఏడాది ఆరంభమైంది. ఏడాదిలో తొలి గ్రాండ్‌స్లామ్‌ జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ అభిమానులను ఆకట్టుకుంది. తర్వాత క్రికెట్లో జనవరి-ఫిబ్రవరి నెలల మధ్య న్యూజిలాండ్‌లో భారత జట్టు పర్యటన ఆసక్తికరంగా సాగింది. అదే సమయంలో మహిళల టీ20 ప్రపంచకప్‌ అంచనాల్ని మించి అభిమానులను అలరించింది. ఇక త్వరలోనే ఐపీఎల్‌.. ఆ తర్వాత యూరో కప్‌.. ఒలింపిక్స్‌.. టీ20 ప్రపంచకప్‌.. మధ్య మధ్యలో వివిధ ఆటల్లో టోర్నీలతో 2020 క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగిస్తుందని అనుకున్నారు అందరూ. కానీ మార్చిలో కరోనా భారత్‌నే కాక ప్రపంచం మొత్తాన్ని కమ్మేసి ఆటలకు పెద్ద బ్రేక్‌ వేసింది.

రద్దు.. వాయిదా

కరోనా మహమ్మారి విజృంభణ మొదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆటలు ఆగిపోయాయి. కొన్ని రోజుల తర్వాత అంతా సర్దుకుంటుందనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. దీంతో వరుసబెట్టి టోర్నీలను వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. లక్షల కోట్ల ఖర్చుతో నిర్వహించే ఒలింపిక్స్‌ సైతం వాయిదానే. ఐపీఎల్‌ వాయిదాతో క్రికెట్‌ ప్రియులకు వేసవిలో ఏమీ తోచలేదు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ వాయిదా పడి, వింబుల్డన్‌ రద్దవడం టెన్నిస్‌ అభిమానులను చికాకు పెట్టింది. యూరో కప్‌ వాయిదా సాకర్‌ ప్రేమికులకు మింగుడు పడలేదు. నెలల తరబడి 'లైవ్‌' వినోదం లేక క్రీడాభిమానులు అసహనానికి గురయ్యారు.

olympics
ఒలింపిక్స్​

మహి టాటా..

భారత క్రికెట్‌ చరిత్రలో కెప్టెన్‌గా, ఆటగాడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ధోని అంతర్జాతీయ కెరీర్‌ ఈ ఏడాదే ముగిసింది. చివరగా 2020 టీ20 ప్రపంచకప్‌ ఆడి ఆ తర్వాత అతను ఆటకు వీడ్కోలు పలుకుతాడని అభిమానులు ఆశించారు. కానీ ఆ టోర్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీంతో ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు అతను రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అదే రోజు ధోనీని అనుసరిస్తూ రైనా కూడా రిటైర్మెంట్‌ ప్రకటించడం విశేషం. పార్థివ్‌ పటేల్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా ఈ ఏడాదే ఆటకు వీడ్కోలు పలికారు. వీళ్లే కాక టెన్నిస్‌లో వోజ్నియాకి, షరపోవా, బ్రయాన్‌ సోదరులు, బ్యాడ్మింటన్‌లో లిన్‌డాన్‌ ఈ ఏడాదే ఆట నుంచి తప్పుకొన్నారు.

dhoni
ధోనీ

కొత్త కొత్తగా.. భయం భయంగా!

ప్రపంచవ్యాప్తంగా నెలల తరబడి కరోనా ప్రభావం కొనసాగుతుండటం వల్ల.. ఎంత కాలమని ఆటల్లేకుండా సాగుతాం, ఎంత నష్టమని భరిస్తాం అని ఆలోచనలో పడ్డ నిర్వాహకులు.. కరోనాను ఎదురొడ్డి టోర్నీలు నిర్వహించడంపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో తెరపైకి వచ్చిందే.. బయో బబుల్‌. ముందుగా ఫుట్‌బాల్‌లో ఈ పద్ధతి మొదలైంది. జులైలో వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ ఈ బుడగను ఏర్పాటు చేయడం వల్ల క్రికెట్‌లో ఈ విధానానికి ప్రాచుర్యం లభించింది. కరోనా విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు పునఃప్రారంభంగా జరిగిన తొలి సిరీస్‌ ఇదే. ఆటగాళ్లతో పాటు మ్యాచ్‌లో భాగమైన అందరి చుట్టూ సురక్షిత వాతావరణం ఏర్పాటు చేయడమే ఈ విధానం. భయం భయంగానే ఈ సిరీస్‌ మొదలైనప్పటికీ.. కరోనా బెడద లేకుండా సురక్షింతంగా మ్యాచ్‌లు సాగిపోవడం వల్ల క్రీడా లోకం ఊపిరి పీల్చుకుంది. వివిధ ఆటలు బయో బబుల్‌ను అందిపుచ్చుకున్నాయి. మరోవైపు వైరస్‌ కారణంగా ఎప్పుడూ లేని విధంగా ఖాళీ స్టేడియాల్లో ఆటగాళ్లు ఆడాల్సి వచ్చింది. ఇలా ఆడటం వారికి, మ్యాచ్‌లు చూడటం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఐపీఎల్‌నూ అలాగే నిర్వహించారు. కాకపోతే మ్యాచ్‌లు చూసే వీక్షకులకు మైదానంలో సందడి లేని లోటు తెలియకుండా కృత్రిమ శబ్దాలు జోడించారు. ఇక న్యూజిలాండ్‌లో వైరస్‌ నుంచి పూర్తిగా బయటపడటం, ఆస్ట్రేలియాలోనూ ప్రభావం బాగా తగ్గడం వల్ల ఈ రెండు చోట్లా స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించి మ్యాచ్‌లు నిర్వహించారు. ఆస్ట్రేలియాతో భారత్‌ సిరీస్‌కు స్టేడియాల్లోకి జనాలను అనుమతించడం మన అభిమానులకు పెద్ద ఉపశమనం. మళ్లీ పాత రోజులకు వెళ్లిన భావన కలిగింది. మరోవైపు చెస్‌, షూటింగ్‌ సహా కొన్ని ఆటలు వర్చువల్‌ బాట పట్టాయి. ఉన్న దగ్గర నుంచే పోటీల్లో పాల్గొనేలా కొత్త సాంకేతిక సాయపడింది.

అమ్మాయిలు తొలిసారి..

మహిళల క్రికెట్టా.. హా అదేం చూస్తాం! ఎలాంటి ఆసక్తి ఉండదు అనే స్థాయి నుంచి.. అరే! మన అమ్మాయిల జట్టు మ్యాచ్‌ ఆడుతుంది.. చూద్దాం పదండి! అనే స్థాయికి భారత మగువలు ఎదగడంలో ఈ ఏడాది కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో హర్మన్‌ సారథ్యంలోని మన జట్టు టైటిల్‌ రేసుకు దూసుకెళ్లింది. ఫైనల్లో ఓడినా.. అమ్మాయిల జట్టుకు ఈ టోర్నీలో లభించిన ఆదరణ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు రేపింది. 2019లో పురుషుల వన్డే ప్రపంచకప్‌ తర్వాత అత్యధిక మంది వీక్షించిన ఐసీసీ టోర్నీగా ఇది రికార్డు నెలకొల్పడం విశేషం.

harman
హర్మన్​

రేసుల్లో రారాజు

తాను చిన్నప్పటి నుంచి ఆరాధించిన షుమాకర్‌ పేరిట ఉన్న అత్యధిక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిళ్ల రికార్డును సమం చేసి ఔరా అనిపించాడు ఎఫ్‌-1 రేసర్‌ హామిల్టన్‌. ఈ ఏడాది ఏడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతను.. షుమీ సరసన చేరాడు. అతడి పేరు మీదే ఉన్న అత్యధిక గ్రాండ్‌ ప్రి విజయాల (91) రికార్డును తిరగరాశాడు. అత్యధిక పోల్‌ పొజిషన్లు (98), అత్యధిక కెరీర్‌ పాయింట్లు (3778).. లాంటి రికార్డులెన్నో అతడి సొంతం.

hamilton
హామిల్టన్​

నాదల్‌ @20

కరోనా వల్ల ఫ్రెంచ్‌ ఓపెన్‌లో చాలా మార్పులు జరిగాయి. టోర్నీ ఆలస్యమైంది. బంతులు మార్చారు. కోర్టుల్లోనూ మార్పులు చేశారు. కానీ ఒక్కటి మాత్రం మారలేదు. అదే.. ట్రోఫీని రఫెల్‌ నాదల్‌ ముద్దాడే దృశ్యం. రికార్డు స్థాయిలో 13వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకుని ఎర్రమట్టిపై తనకు తిరుగులేదని చాటాడు రఫెల్‌ బుల్‌. ఈ విజయంతో.. పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల (20) రికార్డును సమం చేశాడు.

nadal
నాదల్​

ముంబయి వరుసగా..

కరోనాతో అల్లాడిపోయిన భారత యువతకు యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ గొప్ప ఉపశమనం. గత సీజన్లంటికంటే ఉత్కంఠభరితంగా, రసవత్తరంగా సాగిన లీగ్‌.. అభిమానుల్ని ఆద్యంతం అలరించింది. టోర్నీకి రికార్డు స్థాయిలో వీక్షణలు వచ్చాయి. ఆదాయం కూడా పెరిగింది. ఇక ముంబయి ఇండియన్స్‌ వరుసగా రెండో, మొత్తంగా అయిదో టైటిల్‌ సాధించి లీగ్‌లో తనకు సాటిలేదని చాటింది.

చెస్‌లో కొత్త చరిత్ర

చెస్‌లో భారత్‌ ఓ గొప్ప విజయాన్ని అందుకుంది. 96ఏళ్ల ఒలింపియాడ్‌ చరిత్రలో తొలిసారి స్వర్ణం నెగ్గింది. కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ టోర్నీలో ఫైనల్‌ చేరిన భారత్‌ టైటిల్‌ పోరులో రష్యాకు గట్టిపోటీనిచ్చింది. అనూహ్యంగా సర్వర్‌ డౌన్‌ కావడం వల్ల భారత్‌ ఓడింది. సాంకేతికత కారణాలతో భారత్‌ వెనకబడిందని తేల్చిన ప్రపంచ చెస్‌ సమాఖ్య రష్యాతో పాటు భారత్‌ను సంయుక్త విజేతగా ప్రకటించింది. ఆనంద్‌తో పాటు హంపి, హారిక, హరికృష్ణ భారత జట్టులో సభ్యులు.

chess
చెస్​

విషాదాలు

2020 క్రీడాభిమానులకు తీరని శోకం మిగిల్చింది. ఫుట్‌బాల్‌ దిగ్గజం, అర్జెంటీనాకు ప్రపంచకప్‌ అందించిన డీగో మారడోనా నవంబర్‌ 25న గుండెపోటుతో మరణించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఎన్‌బీఏ బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబి బ్రయాంట్‌ మరణవార్త ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. తన కూతురి బాస్కెట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం వెళ్తున్న అతను జనవరి 26న హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించాడు. కోబి కూతురు సైతం ఈ ప్రమాదంలో మృతిచెందింది. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌.. సెప్టెంబర్‌ 24న కన్నుమూశాడు. ఐపీఎల్‌ వ్యాఖ్యానం కోసం ముంబయి వచ్చిన అతను.. అక్కడే హోటల్‌లో గుండెపోటుతో మరణించాడు. భారత క్రీడా దిగ్గజాలు బల్బీర్‌ సింగ్‌ సీనియర్‌ (హాకీ), చేతన్‌ చౌహాన్‌ (క్రికెట్‌), చుని గోస్వామి (ఫుట్‌బాల్‌) కూడా ఈ ఏడాదిలోనే నింగికేగారు.

maradona
మారడోనా

ఇదీ చూడండి :

2020 రౌండప్​: కరోనా పరిస్థితుల్లో క్రికెట్​ జర్నీ సాగిందిలా..

2020 రౌండప్: లోకాన్ని విడిచి.. మదిలో నిలిచి!

Last Updated : Dec 31, 2020, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.