కరోనా తర్వాత భారత్లో ఎక్కువమంది పాల్గొనబోతున్న పోటీలకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి ఆరంభమయ్యే జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 1600 మందికి పైగా అథ్లెట్లు పోటీపడబోతున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి తరలివస్తున్న అథ్లెట్లు 145 ఈవెంట్లలో పాల్గొనబోతున్నారు.
హరియాణా (159) నుంచి అత్యధిక మంది పోటీలో ఉన్నారు. తర్వాత తమిళనాడు(150), కేరళ(142) అత్యధికంగా తమ అథ్లెట్లను పోటీలకి పంపుతున్నారు. ఈ ఏడాది నైరోబిలో ప్రపంచ అండర్-20 టోర్నీ, కువైట్లో ఆసియా యూత్ అథ్లెటిక్స్ ఉన్న నేపథ్యంలో అండర్-20, 18 విభాగాల్లో పాల్గొనే అథ్లెట్లపైనే అందరి దృష్టి ఉంది.
ఇదీ చదవండి:ఆస్ట్రేలియన్ ఓపెన్: ఒకే పార్శ్వంలో సెరెనా, ఒసాకా