ETV Bharat / sports

రియల్ మాడ్రిడ్​కు శుభాకాంక్షలు తెలిపిన రోహిత్ - Indian cricket

లా లిగా విజేతగా నిలిచిన రియల్ మాడ్రిడ్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు టీమ్​ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ. ప్రస్తుతం భారత్​లో ఈ లీగ్​కు ప్రచార కర్తగా ఉన్నాడు హిట్​మ్యాన్.

రియల్ మాడ్రిక్​కు శుభాకాంక్షలు తెలిపిన రోహిత్

author img

By

Published : Jul 17, 2020, 5:57 PM IST

రియల్ మాడ్రిడ్.. లా లిగా టైటిల్ విజేతగా నిలవడంపై సంతోషం వ్యక్తం చేశాడు టీమ్​ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ. జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టాడు.

"రియల్ మాడ్రిడ్ ఖాతాలో మరో టైటిల్. కష్ట సమయంలో జట్టుగా ఆడారు. శుభాకాంక్షలు." అంటూ సందేశం పోస్ట్ చేశాడు హిట్​మ్యాన్.

ప్రస్తుతం భారత్​లో లా లిగా టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్​గా ఉన్నాడు రోహిత్ శర్మ. అలాగే తాను రియల్​ మాడ్రిక్​ అభిమానినని ఆ సందర్భంలో వెల్లడించాడు.

ఇంతకుముందు స్పెయిన్​లో జరిగిన బార్సిలోనా-రియల్ మాడ్రిడ్ మ్యాచ్​కు తన సతీమణి రితికాతో కలిసి హాజరయ్యాడు రోహిత్. లా లిగా ఆతిథ్యం బాగుందని ఆ మ్యాచ్ చూసేందుకు వీలు కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.