ETV Bharat / sports

ఫ్యాన్స్​ ఆందోళనతో ఫుట్​బాల్​ మ్యాచ్​ వాయిదా - మాంచెస్టర్ ప్రీమియర్ లీగ్

మాంచెస్టర్​ వేదికగా జరుగుతోన్న ఫుట్​బాల్​ ప్రీమియర్​ లీగ్​ మ్యాచ్​ వాయిదా పడింది. మాంచెస్టర్​ యునైటెడ్-లివర్​పూల్​ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్​కు అభిమానులు అంతరాయం కలిగించారు.

Premier League, United-Liverpool clash postponed after fans' protest
ఫుట్​బాల్ ప్రీమియర్ లీగ్, మాంచెస్టర్-లివర్​పూల్​ మధ్య మ్యాచ్​ వాయిదా
author img

By

Published : May 3, 2021, 1:06 PM IST

అభిమానుల ఆందోళనతో మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఫుట్​బాల్​ ప్రీమియర్​ లీగ్​లో ఓ మ్యాచ్​ వాయిదా పడింది. మాంచెస్టర్​ యునైటెడ్-లివర్​పూల్​ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్​కు ప్రేక్షకులు అడ్డుపడ్డారు. 2005లో మాంచెస్టర్​ యునైటెడ్​ను గ్లేజర్ కుటుంబీకులు కొనుగోలు చేసినప్పటి నుంచి ఆ జట్టు అభిమానులు వ్యతిరేకిస్తున్నారు.

ఇదీ చదవండి: భారత్​కు క్రికెట్ ఆస్ట్రేలియా విరాళం

"ఓల్డ్​ ట్రాఫోర్డ్​లో పరిస్థితులు చేయిదాటి​పోయాయి. దీంతో ఆదివారం జరగాల్సిన మ్యాచ్​ వాయిదా పడింది. ఇది అందరి సమష్టి నిర్ణయం. అభిమానులు పెద్ద సంఖ్యలో ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూముల్లోకి చొరబడ్డారు. గ్లేజర్స్​ బయటికి వెళ్లిపోండి అని నినాదాలు చేశారు" అని ప్రీమియర్ లీగ్ అధికారిక ప్రకటన చేసింది. ​

ప్రస్తుతం ఈ లీగ్​లో మాంచెస్టర్​ యునైటెడ్​ అగ్రస్థానంలో ఉన్న టీమ్​ కంటే 13 పాయింట్లు వెనకబడి ఉంది. లీగ్​లో మంచి ప్రదర్శన చేయకపోవడం కూడా అభిమానులు ఆగ్రహించడానికి ఒక కారణం.

ఇదీ చదవండి: 'ఆరెంజ్​ జెర్సీలో వార్నర్​ కనిపించడం ఇదే చివరిసారి!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.