ETV Bharat / sports

ప్రీమియర్​ లీగ్ విజేతగా మాంచెస్టర్ సిటీ జట్టు - ప్రీమియర్​ లీగ్ 2020-21

మాంచెస్టర్​ వేదికగా జరిగే ఫుట్​బాల్​ ప్రీమియర్​ లీగ్​ విజేతగా 'మాంచెస్టర్ సిటీ' జట్టు అవతరించింది. మాంచెస్టర్​ యునైటెడ్​తో జరిగిన మ్యాచ్​లో లీసెస్టర్​ సిటీ టీమ్​ 2-1తో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న మాంచెస్టర్​ సిటీ జట్టుయే విజేతగా నిలిచింది.

Manchester City, crowned Premier League champions
మాంచెస్టర్ సిటీ జట్టు, ప్రీమియర్​ లీగ్ విజేత
author img

By

Published : May 12, 2021, 11:37 AM IST

2020-21 ఫుట్​బాల్​ ప్రీమియర్​ లీగ్​ విజేతగా మాంచెస్టర్​ సిటీ జట్టు అవతరించింది. మాంచెస్టర్​ యునైటెడ్​తో జరిగిన మ్యాచ్​లో లీసెస్టర్​ సిటీ టీమ్​ 2-1 తేడాతో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న మాంచెస్టర్​ సిటీ జట్టునే టైటిల్​ వరించింది. గత నాలుగేళ్లలో మూడో టైటిల్​ను తన ఖాతాలో వేసుకుంది ఈ టీమ్​.

పాయింట్ల పట్టికలో 80 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది మాంచెస్టర్ సిటీ. మాంచెస్టర్​ యునైటెడ్​ 70 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. లీసెస్టర్​ సిటీ 66 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. యునైటెడ్​, సిటీ జట్ల మధ్య 10 పాయింట్ల తేడా ఉంది.

"2016లో మాంచెస్టర్​ సిటీ మేనేజర్​గా పెప్​ గార్డియోలా నియామకమయ్యారు. అతని నేతృత్వంలో ఇది పదో పెద్ద టైటిల్. కరోనా ధాటికి ప్రభావితమైన క్రీడల్లో ఇదొక్కటి. అయినప్పటికీ మాంచెస్టర్ సిటీ జట్టు గొప్ప స్థిరత్వాన్ని ప్రదర్శించింది" అని మాంచెస్టర్​ సిటీ తన అధికారిక వెబ్​సైట్​లో పేర్కొంది.

గత నెలలో ఇంగ్లీష్​ లీగ్​ కప్​ను కైవసం చేసుకున్న సిటీ జట్టు.. తాజాగా ప్రీమియర్​ లీగ్​ను తన ఖాతాలో వేసుకుంది. తాజా టైటిల్​తో ఇస్తాంబుల్​ వేదికగా మే 29న జరిగే ఛాంపియన్స్​ లీగ్​ ఫైనల్​కు అర్హత సాధించింది ఈ జట్టు.

ఇదీ చదవండి: 'సారీ మీరు ఇంకో రోగంతో బాధపడుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.