ETV Bharat / sports

ఒక్క ఫొటో- 2 కోట్ల లైక్​లు.. - లియోనల్ మెస్సీ ఇన్‌స్టాగ్రామ్‌

సినిమా తారలు ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసే ఫొటోలకు కోట్లలో లైకులు రావడం మామూలు విషయమే. కానీ.. ఓ అథ్లెట్​ ఫొటోకు రెండు కోట్ల మందికి పైగా లైకు కొట్టడం విశేషమే. ఇటీవల ముగిసిన కోపా అమెరికా టోర్నీతో.. అర్జెంటీనా స్టార్ ఫుట్​బాలర్ లియోనల్ మెస్సి ఈ ఘనత సాధించాడు.

lionel messi
లియోనల్ మెస్సి
author img

By

Published : Jul 20, 2021, 7:40 AM IST

రొనాల్డో, మెస్సి.. ప్రస్తుత తరం ఫుట్‌బాల్‌ ఆటగాళ్లలో దిగ్గజాలు. ఈ ఇద్దరిలో ఎవరు ఆల్‌టైమ్‌ అత్యుత్తమ ఆటగాడు అనే చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రొనాల్డో నెలకొల్పిన ఓ రికార్డును మెస్సి బద్దలుకొట్టాడు. అయితే అది మైదానంలో కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇటీవల కోపా అమెరికా టోర్నీలో అర్జెంటీనాను విజేతగా నిలిపిన మెస్సి.. ఆ ట్రోఫీతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఫొటోకు 2 కోట్లకు (20 మిలియన్లకు) పైగా లైక్‌లు వచ్చాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అథ్లెట్‌ పోస్టు చేసిన ఫొటోకు అత్యధిక లైకుల రికార్డు మెస్సి సొంతమైంది.

lionel messi
ఇన్​స్టాగ్రామ్​లో 2 కోట్ల లైక్‌ల చిత్రం

గతంలో డీగో మారడోనా మరణించినపుడు నివాళిగా ఆయనతో దిగిన ఫొటోను రొనాల్డో పోస్ట్‌ చేయగా.. ఇప్పటివరకూ దానికి కోటి 98 లక్షలకు (19.8 మిలియన్లు) పైగా లైక్‌లు వచ్చాయి. ఇప్పుడా రికార్డును మెస్సి ఫొటో వెనక్కినెట్టింది. కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్‌పై అర్జెంటీనా విజయం సాధించిన సంగతి విదితమే. ఈ విజయంతో మెస్సి తన కెరీర్‌లోనే తొలిసారిగా జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు.

ఈ టోర్నీలో నాలుగు గోల్స్‌తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన అతను 'ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ'గా నిలిచాడు. మరోవైపు బార్సిలోనా క్లబ్బుతో మెస్సి మరోసారి కొత్తగా అయిదేళ్ల పాటు ఒప్పందం చేసుకునే అవకాశముంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.