స్పెయిన్లోని బార్సిలోనా - రియల్ మాడ్రిడ్ మ్యాచ్ల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఓ గ్రాఫిటీ కళాకారుడు వేసిన ఆర్ట్ ఈ మ్యాచ్కు కొత్త చిక్కులు తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఆటగాళ్లు ముద్దు పెట్టుకుంటున్నట్లు పెయిటింగ్ చేసి కవ్వించాడు.
టీవీబాయ్ అని పిలిచే ఈ ఆర్టిస్ట్ బార్సిలోనా డిఫెండర్ గెరార్డ్ పీక్, రియాల్ మాడ్రిడ్ కెప్టెన్ సెర్జియో రామోస్ ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటున్నట్లు బార్సిలోనాలోని నోవూ స్టేడియం సమీపంలో పెయింటింగ్ చేశాడు. అంతేకాకుండా 'కిస్ అండ్ టాక్' (ముద్దు పెట్టి మాట్లాడు) అని క్యాప్షన్ పెట్టి రెచ్చగొట్టాడు.
అయితే భద్రతా కారణాల దృష్యా మంగళవారం జరగాల్సిన ఈ మ్యాచ్ వాయిదా పడింది. ఎప్పుడు జరుగుతుందో బుధవారం చర్చించి తేదీని తెలియజేస్తారు. నోవూ మైదానం ప్రపంచంలోనే అత్యంత ఉత్కంఠ, సున్నితమైన మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన వేదికగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇదీ చదవండి: ఒలింపిక్స్ ట్రయల్స్ టీవీల్లో లైవ్ పెట్టాలి: నిఖత్