ETV Bharat / sports

ఫుట్​బాల్​ ప్రపంచానికి రారాజు రొనాల్డో - పోర్చుగల్

నేడు ఫుట్​బాల్​ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో పుట్టినరోజు. 36వ జన్మదిన వేడుక సందర్భంగా అతడు సాధించిన రికార్డులేమిటో తెలుసుకుందాం.

Five-time Ballon d'Or champion, Cristiano Ronaldo, turns 36!
రొనాల్డో పుట్టినరోజు.. మీరు తెలుసుకోవాల్సిన రికార్డులివే
author img

By

Published : Feb 5, 2021, 12:59 PM IST

ప్రపంచ ఫుట్​బాల్​ దిగ్గజం, పోర్చుగల్​ స్టార్​ ఫుట్​బాలర్ క్రిస్టియానో రొనాల్డో పుట్టినరోజు నేడు. అత్యుత్తమ ఆటతీరు, అసాధారణ నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రొనాల్డో.. 1985 ఫిబ్రవరి 5న జన్మించాడు. పోర్చగల్ ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా, ప్రొఫెషనల్ విభాగంలో సెరీ ఏ క్లబ్ జువెంటస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Five-time Ballon d'Or champion, Cristiano Ronaldo, turns 36!
రొనాల్డో

రికార్డుల రారాజు రొనాల్డో..

ప్రొఫెషనల్ కెరీర్​లోకి స్పోర్టింగ్ సీపీ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు క్రిస్టియానో. 2003లో మాంచెస్టర్ యునైటెడ్‌కు మారాడు. అదే ఏడాది 18 సంవత్సరాల వయసులో పోర్చుగల్ తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. అద్భుత ప్రదర్శనతో 2008లో జాతీయ జట్టు పగ్గాలు చేపట్టాడు. పోర్చుగల్​ తరఫున అత్యధిక గోల్స్ సాధించింది రొనాల్డోనే.

18 ఏళ్ల కెరీర్​లో క్లబ్, దేశం తరఫున 860కి పైగా గోల్స్​ సాధించాడు క్రిస్టియానో. 30కి పైగా పెద్ద ట్రోఫీలు గెలిచాడు. అందులో 5 ఛాంపియన్స్​ లీగ్, 2 లా లిగా టైటిల్స్, 3 ప్రీమియర్ లీగ్ టైటిల్స్​, 2 సెరీ ఏ టైటిల్స్, 5 సార్లు బాలన్ డి'ఓర్, 4 ఫిఫా క్లబ్​ ప్రపంచ టైటిల్స్​ గెలిచాడు.

అంతర్జాతీయంగా ఎక్కువ క్యాప్​లు (167) సాధించిన ఫుట్​బాలర్​ అతడే. ఛాంపియన్స్​ లీగ్​ చరిత్రలో అత్యధిక గోల్స్(130), రియల్​ మాడ్రిడ్ తరఫున ఎక్కువ గోల్స్​(515) చేసిన ప్లేయర్ కూడా​ రొనాల్డోనే.

2016లో యూరోపియన్ ఛాంపియన్‌షిప్, 2019లో నేషనల్ లీగ్‌లో తన జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టిన రొనాల్డో ఫుట్​బాల్​ చరిత్రలో ఎన్నో రికార్డును తన పేరున లిఖించుకున్నాడు.

ఇదీ చూడండి: బార్సిలోనాతో మెస్సీ ఒప్పందం విలువ ఎంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.